Big Stories

AB de Villiers Apology: ‘పెద్ద తప్పు చేశాను’ విరాట్ కోహ్లీ ఇష్యూపై ఏబీడీ క్షమాపణలు!

AB de Villiers Apology on Virat Kohli Issue: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ , టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మంచి స్నేహితులు. ఐపీఎల్ లో ఆర్సీబీ తరఫున ఇద్దరు కలిసి ఆడారు. అప్పటి నుంచి వారి మధ్య స్నేహం బాగా కుదిరింది. ఎన్నోసార్లు కోహ్లీ, ఏబీడీ తమ స్నేహంపై మాట్లాడారు. ఒకరిపైఒకరికి ఉన్న అభిమానాన్ని వ్యక్తపరిచారు. అయితే ఇటీవల కోహ్లీ వ్యక్తిగత జీవితంలో విషయాలపై తప్పుడు సమాచారం ఇచ్చినందుకు డివిలియర్స్ క్షమాపణలు కోరాడు. తాను చెప్పిన విషయంపై విచారం వ్యక్తం చేశాడు.

- Advertisement -

“నా యూట్యూబ్ షోలో నేను చెప్పినట్లు ఖచ్చితంగా కుటుంబానికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే నేను అదే సమయంలో ఒక ఘోరమైన తప్పు చేశాను. అసత్య సమాచారాన్ని పంచుకున్నాను. ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. నేను అతనికి శుభాకాంక్షలు చెప్పగలను. విరాట్‌ను అనుసరించే, అతని క్రికెట్‌ను ఆస్వాదించే ప్రపంచం మొత్తం అతనికి శుభాకాంక్షలు మాత్రమే చెప్పాలి. ఈ విరామానికి కారణం ఏదైనా కావచ్చు. అతను బలంగా, మంచిగా, ఆరోగ్యంగా తిరిగి వస్తాడని నిజంగా ఆశిస్తున్నాను. ” అని దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ డివిలియర్స్ తాజాగా అన్నాడు.

- Advertisement -

Read More:Virat Kohli : కొహ్లీ అందుకే రాలేదంట.. ప్రకటించిన డివిలియర్స్‌

కమ్యూనికేషన్‌లో తప్పు..
కోహ్లీ, అనుష్క శర్మ తమ రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారని అంతకుముందు డివిలియర్స్ వెల్లడించాడు. ఇంగ్లండ్ సిరీస్‌లోని టెస్టు మ్యాచ్‌లను అందుబాటులో లేకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ తీసుకున్న నిర్ణయానికి కుటుంబ కట్టుబాట్లు కారణమని పేర్కొన్నాడు. అయితే ఈ ప్రకటన సరికాదని తేలింది. కీలక సమయంలో కోహ్లీ గైర్హాజరైనందుకు భారత క్రికెట్ ఫ్యాన్స్ నుంచి విమర్శలు వచ్చాయి.

స్వరం మారింది..
తన తప్పును గ్రహించిన డివిలియర్స్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాడు. తన తప్పును అంగీకరించాడు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు క్షమాపణలు చెప్పాడు.ఇటీవల ఇంటర్వ్యూలో కోహ్లీ ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో గైర్హాజరీపై డివిలియర్స్ ప్రకటన చేశాడు.

కోహ్లీకి విరామం పొడిగింపు..
కోహ్లీ సుదీర్ఘ విరామంపై ఇంకా అనేక ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజ్‌కోట్, రాంచీలో జరిగే టెస్టులకు కోహ్లీ అందుబాటులో ఉండని తెలుస్తోంది. అతను ఆట నుంచి విరామం ఎందుకునే తీసుకుంటున్నాడనే ప్రశ్నలు మాత్రం ఇంకా తలెత్తుతున్నాయి.

బీసీసీఐ మౌనం..
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇంకా కోహ్లీపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. రాబోయే మ్యాచ్‌లకు సెలెక్టర్ల నిర్ణయాలపై అనిశ్చితి నెలకొంది. కోహ్లీ పరిస్థితిపై స్పష్టత కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రికెట్ అధికారుల నుంచి పారదర్శక ప్రకటన ఆశిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News