BigTV English

Virat Kohli : కొహ్లీ అందుకే రాలేదంట.. ప్రకటించిన డివిలియర్స్‌

Virat Kohli : కొహ్లీ అందుకే రాలేదంట.. ప్రకటించిన డివిలియర్స్‌
AB de Villiers about Virat Kohli

AB de Villiers about Virat Kohli : విరాట్ కొహ్లీ రెండు టెస్ట్ మ్యాచ్ లకు ఎందుకు దూరమయ్యాడనేది తెలీక, నెట్టింట జనం నలిగిపోయారు. ఎక్కడెక్కడో వెతికారు. వీసమెత్తయినా విషయం తెలీలేదు. ఆఖరికి బీసీసీఐ కూడా సరైన కారణాలు చెప్పలేదు. అది కొహ్లీ పర్సనల్ అని చెప్పినా సరే,  సోషల్ మీడియా ఆగలేదు. కొహ్లీ అమ్మగారికి బాగా లేదు, ఆసుపత్రిలో ఉన్నారని చెప్పి హడావుడి చేశారు. దీంతో కొహ్లీ తమ్ముడు వికాస్ కొహ్లీ సీరియస్ అయ్యాడు. ఆ ప్రహసనం అప్పటికి ఆగింది. అంతకుముందు అనుష్కశర్మ ఆరోగ్యం బాగాలేదని రాసుకొచ్చారు. కొహ్లీ ఇంట్లో ఎవరికో బాగాలేదని సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది.


ఎట్టకేలకు వీటన్నింటికి విరాట్ కొహ్లీ క్లోజ్ ఫ్రెండ్, మిస్టర్ 360 అయిన సౌతాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఫుల్ స్టాప్ పెట్టాడు. తన యూట్యూబ్  ఛానల్ లో మాట్లాడుతూ ఎవరూ టెన్షన్ పడాల్సిన పనిలేదు. సంతోషించాల్సిన విషయమేనని అన్నాడు. అందరికీ తెలిసిన విషయమేనని, తన నోటి వెంట అధికారికంగా చెప్పాడు.

విరాట్ కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడని తెలిపాడు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ డెలివరీకి సిద్దంగా ఉండటంతో.. ఆమెతో గడిపేందుకు అంతర్జాతీయ క్రికెట్‌‌ నుంచి కోహ్లీ బ్రేక్ తీసుకున్నాడని స్పష్టం చేశాడు. కొహ్లీకి మెసేజ్ చేశానని, తను అసలు విషయం తెలిపాడని అన్నాడు.


ఇన్నాళ్లు క్రికెట్ ప్రపంచంగా కుటుంబానికి దూరమైన కొహ్లీ, భార్య అనుష్క డెలివరీ సమయంలో, తన దగ్గర ఉండాలని భావిస్తున్నాడని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఈ సమయంలోనైనా కుటుంబానికి ప్రాధానత్య ఇవ్వాలని కొందరు సూచిస్తున్నారు. కొహ్లీ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడని కొందరు అంటున్నారు.

నిజానికి క్రికెటర్లకు వ్యక్తిగత జీవితం చాలా తక్కువగా ఉంటుంది. పండగలు,పెళ్లిళ్లు ఏవీ ఉండవు. ఆరోజు మ్యాచ్ లేని రోజునే వారికి సెలవు, ఆరోజే పండుగ అని అంటున్నారు. అందుకనే భార్య దగ్గర కొహ్లీ ఉన్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొందరు కంగ్రాట్స్ కూడా చెబుతున్నారు.

విషయం తెలిసింది పోయింది కాబట్టి, కొహ్లీ మళ్లీ ఎప్పుడు టీమ్ ఇండియాలో కలుస్తాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూడో టెస్ట్ లో కలుస్తాడా? లేక? నాలుగో టెస్ట్ నుంచి జాయిన్ అవుతాడా? అనేది వేచి చూడాల్సిందే.

Related News

5 Balls Won Match: 5 బంతుల్లో ముగిసిన మ్యాచ్…7 గురు డకౌట్… 23 పరుగులకే ఆలౌట్

Mohamed Siraj : సేమ్ టు సేమ్ డిట్టు దించేశారు… మహమ్మద్ సిరాజ్ కూడా కుళ్ళుకోవాల్సిందే

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Big Stories

×