AB de Villiers : సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ (AB DE VILLIERS) కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దాదాపు 7 సంవత్సరాల కిందటే అంతర్జాతీయ క్రికెట్ కి దూరమైన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఆ తరువాత ఫ్రాంచైజీ క్రికెట్ తోనూ అభిమానులను అలరించాడు. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లైయర్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలుత ఢిల్లీ డేర్ డేవిల్స్ తో తన ఐపీఎల్ ప్రయాణం ప్రారంభించిన డివిలీయర్స్.. 2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరాడు. రిటైర్మెంట్ వరకు కూడా అదే జట్టుతో కొనసాగాడు ఏబీ డివిలియర్స్. దీంతో ఆర్సీబీతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది.
కోచ్ లేదంటే మెంటార్ గా..
ఇటీవల ఐపీఎల్ 2025 ఫైనల్ ఆర్సీబీ గెలవగానే యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ తో కలిసి డివిలియరస్ కూడా విరాట్ కోహ్లీతో సంబురాుల జరుపుకున్నాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన టైటిల్ పోరులో ఆర్సీబీకి మద్దతుగా వచ్చి.. ఆర్సీబీ 17 ఏళ్ల సుదీర్ఘ కల నెరవేరగానే డివిలియర్స్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఇప్పటికీ డివిలియర్స్ తమ జట్టులో భాగంగానే భావిస్తారు. అతను తిరిగి వస్తే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా తమ అభిలాషను తెలుపుతూ ఉంటారు. ఇందుకు సమయం ఆసన్నమైనట్టే కనిపిస్తోంది. డివిలియర్స్ స్వయంగా ఈ విషయం పై స్పందించాడు. ఆటగాడిగా రీ ఎంట్రీ కాకుండా.. కోచ్ లేదంటే మెంటార్ పాత్రలో ఆర్సీబీలో చేరే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాడు. భవిష్యత్ లో నేను మళ్లీ ఐపీఎల్ లో భాగమయ్యే అవకాశం ఉంది. అయితే సీజన్ ఆసాంతం ప్రొఫెషనల్ విధులు నిర్వర్తించేందుకు నేను సిద్ధంగా లేను.
మనసంతా ఆర్సీబీతోనే..
ఆ రోజులు ముగిసిపోయాయి. ఏదేమైనా నా మనస్సు ఎల్లప్పుడూ ఆర్సీబీతోనే ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీ ఫ్రాంచైజీ నాకు కోచ్ లేదా మెంటార్ గా బాధ్యతలు అప్పగించాలని భావిస్తే.. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. భవిష్యత్ లో ఐపీఎల్ లో పునరాగమనం చేస్తే కచ్చితంగా ఆర్సీబీతోనే ఉంటాను”అని డివిలియర్స్ సంస్థ IANS తో పేర్కొన్నాడు. సౌతాఫ్రికా తరపున 2004-2018 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. తన కెరీర్ లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 8765, 9577, 1672 పరుగులు సాధించారు. ఐపీఎల్ లో 184 మ్యాచ్ లు ఆడిన ఏబీ డివిలియర్స్ 5162 పరుగులు సాధించాడు. ఇందులో 40 హాఫ్ సెంచరీలు, మూడు సెంచరీలు ఉన్నాయి. 2021లో ఆర్సీబీ తరున కోల్ కతా నైట్ రైడర్స్ తో పోరులో డివిలియర్స్ చివరగా తన ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు.
?igsh=bm8xOGUzbnViaHVv