Honeybee Venom Destroy Breast Cancer Cells: తేనెటీగల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి వ్యవసాయానికి, పర్యావరణానికి ఎంతో ఉపయోగపడుతాయి. అంతేకాదు, ప్రతి ఒక్కరికీ ఇష్టమైన తేనెను అందించడంలో కీలక పాత్రపోషిస్తాయి. ఇక తేనెతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. తేనె సహజ స్వీటెనర్ గా ఉపయోగపడుతుంది. తేనెలోయాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. తేనె రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గాయాలు మానడంలో ఉపయోగపడుతుంది. తగ్గు, జలుబు, విష జ్వరాలు రాకుండా కాపాడుతుంది.
తేనెటీగ విషమే ఔషధం అంటున్న పరిశోధకులు
నిజానికి తేనెటీగ కరిస్తే ఆ ప్రాంతంలో విపరీమైన నొప్పి ఏర్పడుతుంది. బాగా వాపు రావడంతో పాటు చర్మం ఎరుపు వర్ణంలోకి మారుతుంది. కొందరికి తేనెటీగ కరవడం వల్ల శరీరంగా అంతా అలెర్జీ ఏర్పడుతుంది. ఒళ్లంతా వాపు ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో పరిశోధకులు కీలక విషయాన్ని వెల్లడించారు. తేనెటీగల్లోని విషం అత్యంత శక్తివంతమైన ఔషధంగా పని చేస్తుందన్నారు. ముఖ్యంగా తేనెటీగ విషానికి రొమ్ము క్యాన్సర్ ను నయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల పరిశోధనలు వెల్లడి
తేనెటీగ విషం రొమ్ము క్యాన్సర్ కు పవర్ ఫుల్ మెడిసిన్ గా పని చేస్తుదని ఆస్ట్రేలియా పరిశోధకులు గుర్తించారు. హ్యారీ పెర్కిన్స్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సైంటిస్టులు చేసిన అధ్యయనంలో.. తేనెటీగల విషంలో ఉండే మెలిటిన్ అనే పదా రొమ్ము క్యాన్సర్ కణాలను కేవలం గంటల వ్యవధిలో నాశనం చేస్తున్నట్లు కనుగొన్నారు. ముఖ్యంగా అత్యంత ప్రమాదకరమైన ట్రిపుల్ నెగటివ్ రొమ్ము క్యాన్సర్ ను ఎదుర్కోవడంలో అత్యంత ఎఫెక్టివ్ గా పని చేస్తున్నట్లు గుర్తించారు. నిజానికి ఈ రకం క్యాన్సర్ ను చికిత్స చేయడం చాలా కష్టం అంటున్నారు పరిశోధకులు.
అధ్యయనంలో తేలిన కీలక విషయాలు
తేనెటీగ విషంలోని మెలిటిన్ తక్కువ సమయంలో క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. క్యాన్సర్ కణాల పెరుగుదల నియంత్రించే సిగ్నల్స్ ను నిలిపేస్తుందన్నారు. సాధారణ కణాలపై ప్రభావం చూపించకుండా, మెలిటిన్ టార్గెట్ గా క్యాన్సర్ కణాలపై మాత్రమే పని చేస్తుందన్నారు. కీమోథెరపీ మందులతో మెలిటిన్ ను కలిపి ఉపయోగిస్తే మందులు క్యాన్సర్ కణాల్లోకి బాగా చొచ్చుకుపోయే అవకాశం ఉందన్నారు. తేనెటీగల విషంలోని మెలిటిన్ ను ఔషధంగా వినియోగించడానికి ఇంకా చాలా పరిశోధనలు అవసరం అంటున్నారు పరిశోధకులు. ఎంత మోతాదులో ఇవ్వాలి? దీర్ఘకాలిక ప్రభావాలు ఎలా ఉంటాయి? అనే అంశాలు సహా పలు అంశాలపై స్టడీ జరగాల్సిన అవసరం ఉందన్నారు. మెలిటిన్ పరిశోధనలో ముందడుగు పడితే, రొమ్ము క్యాన్సర్ చికిత్సలో కీలక ముందడుగు పడే అవకాశం ఉంటుంది.
Read Also: రీల్స్ చూడటం.. ఆల్కహాల్ తాగడం కంటే డేంజరా?