Big Stories

Ab De Villiers : ఒక్క కన్నుతోనే క్రికెట్ ఆడా: ఏబీ డీవిలియర్స్

Ab De Villiers

Ab De Villiers : క్రికెట్ ప్రపంచంలో ఏబీడీ అంటే అదొక బ్రాండ్ అన్నమాట. తనదొక ప్రత్యేకమైన బ్యాటింగ్ శైలితో గ్రౌండ్ నలువైపులా కొట్టే షాట్లతో అలరించాడు. దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాళ్లలో తను కూడా ఒకడిగా పేరు పొందాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఫ్యాన్స్ ని సంపాదించాడు. ఐపీఎల్ లీగ్ ద్వారా కూడా భారతీయుల్లో కూడా ఏబీడీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. మిస్టర్ 360 అని అందరూ పిలుచుకునే డివిల్లియర్స్ ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు.

- Advertisement -

2018లో కెరీర్ మంచి పీక్ లో ఉన్నప్పుడు 34 ఏళ్ల వయసులో సడన్ గా ఏబీడీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఎందుకలా చేశాడో ఎవరికీ అర్థం కాలేదు. ఆరోజు అసలు విషయం చెప్పలేదు, కానీ అప్పుడెందుకు అలా చేశాడో ఇప్పుడు వివరించాడు.

- Advertisement -

త‌న చిన్న‌కొడుకు అనుకోకుండా త‌న కంటిని కాలితో త‌న్నిన‌ట్లు చెప్పాడు. దీంతో త‌న ఎడ‌మ కంటికి గాయ‌మైంద‌ని, దృష్టి లోపించింద‌ని చెప్పుకొచ్చాడు. అయితే ఆపరేషన్ చేయించుకున్నానని అన్నాడు. కానీ డాక్టర్లు మాత్రం  క్రికెట్ కి దూరంగా ఉండమని చెప్పారని అన్నాడు.  ఇదే విషయాన్ని బోర్డుకి తెలిపి అర్థాంతరంగా రిటైర్మెంట్ తీసుకున్నానని అన్నాడు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన‌ప్ప‌టికీ రెండేళ్లు  ప్రాంఛైజీ క్రికెట్ ఆడాన‌ని, అదృష్టవ‌శాత్తూ త‌న కంటి వ‌ల్ల ఎటువంటి సమస్యలు రాలేదని అన్నాడు. ఐపీఎల్ లో 2021 సీజ‌న్ ఆడిన డివిలియ‌ర్స్ ఆ తర్వాత అన్ని ఫార్మాట్ల నుంచి త‌ప్పుకున్నాడు. రిటైరైన తర్వా త నుంచి దాదాపు ఒక కన్నుతోనే క్రికెట్ ఆడానని నవ్వూతూ తెలిపాడు.

ఒక కన్ను పాక్షికంగా మాత్రమే చూపు తగ్గిందని అన్నాడు. కానీ అది క్రికెట్ కి సరిపోదని, కానీ భగవంతుడి దయవల్ల మరో కన్ను అద్భుతంగా ఉండటంతో కవర్ చేశానని తెలిపాడు. 2004లో ద‌క్షిణాఫ్రికా త‌రపున అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఏబీ డివిలియ‌ర్స్‌ అడుగుపెట్టాడు. 114 టెస్టులు, 228 వ‌న్డేలు, 78 టీ20 మ్యాచులు ఆడాడు. 114 టెస్టుల్లో 50.66 స‌గ‌టుతో 8765 ప‌రుగులు చేశాడు. ఇందులో 22 సెంచ‌రీలు,  2 డబుల్ సెంచరీలు, 46 అర్ధ‌ సెంచరీలున్నాయి. 228 వ‌న్డేల్లో 53.5 స‌గ‌టుతో 9473 ప‌రుగులు చేశాడు. ఇందులో 25 శ‌త‌కాలు, 53 అర్ధ‌ సెంచరీలున్నాయి.  78 టీ20 మ్యాచుల్లో 26.1 స‌గ‌టుతో 1672 ప‌రుగులు చేశాడు. ఇందులో 10 అర్థ సెంచ‌రీలున్నాయి.

ఇక ఐపీఎల్‌లో 184 మ్యాచులు ఆడాడు. 39.7 స‌గ‌టుతో 5162 ప‌రుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 40 అర్ధ‌ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో 2008 నుంచి 2010 వ‌ర‌కు ఢిల్లీ డేర్ డేవిల్స్ త‌రుపున ఆడిన డివిలియ‌ర్స్ ఆ త‌రువాత 2011-2021 వ‌ర‌కు అంటే రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) జ‌ట్టుకు ఆడాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News