Big Stories

CJI Chandrachud | వాదించడం ఆపి.. వినడం నేర్చుకోవాలి : సుప్రీం చీఫ్ జస్టిస్

CJI Chandrachud | ఎదుటివారి మాటలను పట్టించుకోకుండా.. తన వాదనని మాత్రమే వినిపించడమనేది మన సమాజంలో ఒక ప్రధాన సమస్యగా మారిందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్ అన్నారు. ఎదుటివారి మాటలను.. వారి సూచనలను గమనించే పరిణతి మనలో వచ్చినప్పుడే.. చుట్టూ ఉన్న ప్రపంచంలో కొత్త విషయాలని అర్థం చేసుకునే అవకాశం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. వినయం, ధైర్యం, చిత్తశుద్ధిని సహచరులుగా మన జీవిత ప్రయాణంలో చేసుకోవాలి అని ఆయన సూచించారు.

- Advertisement -

పుణె‌లో ఉన్న సింబయాసిస్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన విలువలు, వ్తక్తిత్వ వికాసం అంశాలపై ప్రసంగించారు. మన మాటే నెగ్గాలన్న మనస్తత్వంతో వాదించడం పక్కనపెట్టి.. ఎదుటివారి మాటను కూడా విని అర్థం చేసుకునే పరిణతిని ప్రతి ఒక్కరూ సాధించాలన్నారు. ప్రశ్నించేందుకు ఈతరం యువత భయపడటం లేదని సీజేఐ అన్నారు. ఇటీవల ఒక బాలిక తన ప్రాంతంలోని రోడ్ల దుస్థితి గురించి చెబుతూ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసిందని చెప్పారు. సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నవారు, మానవత్వంతో ప్రవర్తించేవారు మాత్రమే నిజమైన బలవంతులని వ్యాఖ్యానించారు.

- Advertisement -

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News