Mohammad Amir: అల్లు అర్జున్ ( Allu Arjun ) నటించిన పుష్ప 2 సినిమా ( Pushpa 2) ఎల్లలు దాటుతోంది. సినిమా అభిమానులనే కాకుండా క్రికెటర్లను సైతం… అల్లు అర్జున్ చేసిన తగ్గేదేలే అనే మ్యానరిజం… ఆకట్టుకుంటుంది. ఈ తరుణంలోనే క్రికెట్ స్టేడియంలో సిక్స్ లు కొట్టిన, లేదా వికెట్లు తీసిన… తగ్గేదేలే ( Thaggedele ) అంటూ క్రికెటర్లు రచ్చ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే డేవిడ్ వార్నర్ నుంచి నితీష్ కుమార్ రెడ్డి వరకు అందరూ అల్లు అర్జున్ ను ఫాలో అయ్యారు. ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నితీష్ కుమార్ రెడ్డి అల్లు అర్జున్ తగ్గేదేలే.. అనే మ్యానరిజంతో రెచ్చిపోయాడు.
Also Read: IND vs ENG 1st T20: దుమ్ములేపిన అభిషేక్ శర్మ.. టీమిండియా గ్రాండ్ విక్టరీ
అయితే తాజాగా పుష్ప మానియా ఇప్పుడు పాకిస్తాన్ ( pakisthan ) క్రికెటర్లకు కూడా తగిలింది. లేటెస్ట్ గా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమీర్ ( Mohammad Amir ) కూడా పుష్ప తరహాలోనే సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. వికెట్ తీసిన వెంటనే… అల్లు అర్జున్ తరహా లోనే తగ్గేదే లేదు అంటూ… స్టేడియంలో… రచ్చ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమీర్ ( Mohammad Amir ). ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బుధవారం అంటే జనవరి 22వ తేదీన జరిగిన మ్యాచ్ లో వికెట్ తీసిన తర్వాత పుష్ప వేడుకను తీసుకొచ్చాడు. పాకిస్థాన్ పేసర్ మహ్మద్ అమీర్. ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ T20లో ( International League T20 ) డెసర్ట్ వైపర్స్ వర్సెస్ షార్జా వారియర్స్ ( Desert Vipers vs Sharjah Warriors ) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన జరిగింది. డెసర్ట్ వైపర్స్ కెప్టెన్ లాకీ ఫెర్గూసన్ ( Desert Vipers captain Lockie Ferguson ) టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దింతో వెంటనే డెసర్ట్ వైపర్స్ కెప్టెన్ లాకీ ఫెర్గూసన్ కొత్త బంతిని మహ్మద్ అమీర్‌కి అందించాడు.
Also Read: IND vs ENG 1st T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. షమీకి బిగ్ షాక్!
ఈ తరుణంలోనే మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టడం జరిగింది మహ్మద్ అమీర్. దింతో జట్టుకు అద్భుతమైన ప్రారంభాన్ని అందించాడు. మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టడంతో పాకిస్థాన్ పేసర్ మహ్మద్ అమీర్ ( Mohammad Amir ) పుష్ప సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. ఆ తర్వాత మూడో ఓవర్ లో మరో వికెట్ తీసి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమీర్ ( Mohammad Amir ) పుష్ప తరహాలోనే సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. మూడో ఓవర్ చివరి బంతికి 2 పరుగుల వద్ద రోహన్ ముస్తఫాను ( Rohan Musta ) అవుట్ చేశాడు. కాగా ఈ మ్యాచ్ లో డెసర్ట్ వైపర్స్ ( Desert Vipers ) 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Mohammad Amir does the Pushpa celebration after the wicket. 🌟pic.twitter.com/6MZ68UCvSQ
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 22, 2025