Shruti Haasan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఆసక్తికర సంఘటన జరిగింది. హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయినందుకు.. టాలీవుడ్ హీరోయిన్ చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో… చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా ఓటమిపాలైంది. అయితే ఈ ఓటమి జీర్ణించుకోలేని కొంతమంది చాలా ఎమోషనల్ అవుతున్నారు.
Also Read: RCB Fandom : ఒరేయ్ బుడ్డోడా… CSK వాళ్లకు దొరికితే నీ పని అయిపోయినట్టే
కన్నీళ్లు పెట్టుకున్న టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్
హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలు కావడంతో… కమల్ హాసన్ కూతురు హీరోయిన్ శృతిహాసన్ కూడా.. చాలా ఎమోషనల్ అయ్యారు. తమ సొంత జట్టు సొంత గడ్డపై ఓడిపోవడానికి జీర్ణించుకోలేక కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు హీరోయిన్ శృతిహాసన్. హైదరాబాద్ చేతిలో… ఐదు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడంతో… ఆమె ఎంత ఆపుకున్నా… కన్నీళ్లు మాత్రం ఆగలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక హీరోయిన్ శృతిహాసన్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేసి… మరింత మసాలా కలుపుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని… దానికి ఉదాహరణ శృతిహాసన్ కన్నీళ్లు అంటూ కొంతమంది అంటుంటే… చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోతే ఇలా కూడా ఏడుస్తారని మరి కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ ఫ్యాన్స్ మాత్రం విభిన్నంగా.. హీరోయిన్ శృతిహాసన్ ను ఆడుకుంటున్నారు. హైదరాబాద్ దెబ్బకు శృతిహాసన్ కు… కన్నీళ్లు వచ్చాయని మరికొంతమంది సెటైర్లు పేల్చుతున్నారు.
తెలుగులో సినిమాలు చేసుకుంటూ…. బతికే నీకు… చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎక్కువయిందా..? మీ తమిళ క్రికెట్ జట్టుకే సపోర్ట్ చేస్తావా ? తెలుగోడి డబ్బులతో బతుకుతున్న నీవు… చెన్నై వైపు ఉంటావా అని హైదరాబాద్ ఫ్యాన్స్ దారుణంగా బూతులతో రెచ్చిపోతున్నారు. మొత్తానికి శృతిహాసన్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ కావడంతో కొంతమంది పాజిటివ్ గా మరికొంతమంది ట్రోలింగ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
తాళిబొట్టుతో మెరిసిన శృతిహాసన్
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ నేపథ్యంలో… హీరోయిన్ శృతిహాసన్ తాళిబొట్టుతో మెరిసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎల్లో కలర్ లో ఉన్న విజిల్ ను శృతిహాసన్ ధరించింది. మెడలో వేసుకుని రచ్చ చేసింది. అయితే ఆ విజిల్ ను.. తప్పుగా అర్థం చేసుకున్న కొంతమంది… ఆమె మెడలో పసుపు తాళిబొట్టు ఉందని.. రహస్యంగా ఆమె పెళ్లి చేసుకుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఒక్క మ్యాచ్ కే శృతిహాసన్ హాట్ టాపిక్ అయ్యారు.
Also Read: Kavya Maran: హర్షల్ పటేల్ ను బండ బూతులు తిట్టిన కావ్య.. కమిందును కూడా !
Shruthi Hassan Crying Because of Chennai kings Lose The Important Match Against Sunrise hyderabad #ShrutiHaasan #ChennaiSuperKings #CSKvsSRH2025 pic.twitter.com/axJg47jG63
— @Actresses (@Actressespics_3) April 25, 2025