BigTV English

Owner Buys Stolen Car: చోరీ కారును ఓనర్‌కే విక్రయించిన దొంగలు.. కారు నెంబర్ మార్చినా ఎలా గుర్తు పట్టాడంటే?

Owner Buys Stolen Car: చోరీ కారును ఓనర్‌కే విక్రయించిన దొంగలు.. కారు నెంబర్ మార్చినా ఎలా గుర్తు పట్టాడంటే?

Owner Buys Stolen Car| ప్రపంచంలో ఎన్నో విచిత్ర ఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటి గురించి తెలిస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. తాజాగా ఒక విచిత్ర ఘటన ఇంగ్లాండ్ లో జరిగింది. ఒక యువకుడి కారుని చోరీ చేసిన దొంగలు తెలియక అతడికు విక్రయించారు. ఆ కారు ఓనర్ కూడా తన కారుని కొనే సమయంలో గుర్తు పట్టలేకపోయాడు. కానీ క్రమంగా ఆ కారుని ఉపయోగించే కొద్దీ అతనికి పాత అనుభూతి కలిగింది. పైగా కారులో కొన్ని అదనపు హంగులు అతడు గతంలో చేసినవే ఉండడంతో అతనికి విచిత్ర ఫీలింగ్ కలిగింది. అందుకే అతడు కారుని ఒక రోజు పూర్తిగా పరిశీలించగా.. అది తాను పోగొట్టుకున్న కారే అని కచ్చితంగా నిర్ధరణ అయింది. ఈ విచిత్ర ఘటన గురించి బిబిసి మీడియా కథనం ప్రచురించింది.


బిబిసీ మీడియా ప్రకారం.. ఇంగ్లాండ్ వెస్ట్ మిడ్ ల్యాండ్స్ కౌంటీ.. సోలీహుల్ పట్టణంలో నివసించే ఇవాన్ వాలెంటైన్ అనే ఓ 36 ఏళ్ల యువకుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అతడు రెండేళ్ల క్రితం తనకు ఓ మంచి కారు కావాలని భావించి బ్లాక్ కలర్ కొత్త హోండా సివిక్ కొనగోలు చేశాడు. అయితే ఫిబ్రవరి 2025లో ఆ కారును ఎవరో దొంగతనం చేశారు.

ఇవాన్ వాలెంటైన్ తన ఇంటి ముందు డ్రైవ్ వే లోని కారు పార్క్ చేసి ఉండగా.. దొంగలు కారుని చాకచక్యంగా తీసుకెళ్లారు. ఇవాన్ వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతడి కారు కోసం ఎంత వెతికినా లాభం లేకపోయింది. చివరికి పోలీసులు ఇవాన్ ను పిలిచి ఇక అతని కారు రికవరీ చేయడం అసాధ్యం అని చెప్పేశారు. ఈ పాటికే కారుని పార్ట్స్ గా వేరు చేసి విక్రయించేసి ఉంటారని ఇవాన్ చెప్పారు.


అయితే ఇవాన్ తన ఫేవరెట్ కారుని పొగొట్టుకొని నిరాశలో ఉండగా.. అతను ఇన్సూరెన్స్ కోసం అప్లే చేసిన డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులతో ఇవాన్.. తిరిగి అలాంటి కారు మాత్రమే కొనాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతని వద్ద అప్పటికి కొత్త కారు కొనుగోలు చేసేంత ధనం లేదు. అందుకే సెకండ్ హ్యాండ్ కారు (యూజ్ డ్ కార్స్) వద్ద నుంచి మళ్లీ బ్లాక్ కలర్ హోండా సివిక్ కొనుగోలు చేశాడు.

Also Read: 42 ఏళ్లుగా గల్ఫ్‌ దేశంలో చిక్కుకున్న కొడుకు.. 90 ఏళ్ల తల్లి నిరీక్షణ ఫలించేనా?

ఈ కారు నెంబరు వేరే.. రిజిస్ట్రేషన్ సహా అన్ని పత్రాలు కచ్చితంగా ఉన్నాయి. పైగా కారు మంచి కండీషన్ లో ఉంది. ఇవాన్ ఆ కారు తనకు లభించినందుకు సంతోషంగా ఉన్నాడు. అయితే కారు కొన్నాక ఇవాన్ దాన్ని నడుపుతుంటే అచ్చం తన పాత కారు లాగే ఫీలింగ్ వచ్చింది. రెండు రోజులు తరువాత ఇవాన్ తనకు ఆ విచిత్ర ఫీలింగ్ రావడంతో అనుమానంతో కారులోని అదనపు హంగులను బాగా పరిశీలించాడు.అందులో అతను గతంలో దాచిన క్రిస్మస్ పైన్ ట్రీ బొమ్మలు కనిపించాయి. పైగా కారులో అతను ఫ్రెండ్స్ లో కూర్చొని మద్యం సేవించేందుకు సింగిల్ టెంట్ పెగ్ అమర్చుకున్నాడు. అది కూడా అలాగే ఉంది. ఇక అన్నింటి కంటే షాకింగ్ విషయమేమిటంటే.. ఇవాన తన తల్లిదండ్రుల అడ్రెస్ ని ఆ కారు ఆటో నావిగేషన్ సిస్టమ్ లో సేవ్ చేశాడు. అది కూడా అలాగే ఉంది. కారు రెజిస్ట్రేషన్ కూడా తన పాత కారు సంవత్సరంలోనే ఉంది. అయితే కాస్త మైలేజీ తక్కువ ఇస్తోంది. ఇవన్నీ చూసి అది తన కారే అని ఆశ్చర్యపోయాడు ఇవాన్.

ఈ విషయాన్ని ఇవాన్ స్థానిక పోలీసుకు తెలిపాడు. ఆ తరువాత మీడియాలో ఈ వార్త రాగానే స్థానికంగా అందరూ ఆశ్చర్యపోయారు. బిబిసి మీడియా ఇవాన్ ని సంప్రదించి అతడిని ఇంటర్‌వ్యూ చేయగా.. అతను మాట్లాడుతూ.. “అది నేను పొగొట్టుకున్న కారు అని తెలియగానే నేను ఏదో విజయం సాధించనట్లు తొలుత ఫీలయ్యాను. కానీ ఆ తరువాత నాకు ఏం అర్ధమైందంటే నేనేమి విజయం సాధించలేదు గానీ.. నన్ను ఎవరో మూర్ఖుడిని చేశారు” అని సరదాగా చెప్పాడు. పోలీసులు ఇవాన్ కొనుగోలు చేసిన సెకండ్ హ్యాండ్ కారు కంపెనీ నిర్వహకులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. దొంగతనానికి గురైన కారుని వారు ఎలా కొనుగోలు చేశారు. దానికి కొత్త రెజిస్ట్రేషన్ ఎలా సంపాదించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×