Singer Sunitha:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అద్భుతమైన గాత్రంతో తెలుగు శ్రోతలను అలరిస్తూ స్టార్ సింగర్ గా పేరు సొంతం చేసుకుంది సునీత (Sunitha). ముఖ్యంగా ఒకవైపు సింగర్ గా వ్యవహరిస్తూనే మరొకవైపు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతోమంది హీరోయిన్లకు గాత్రదానం చేసిన ఈమె.. ఎన్నో సినిమాలకు పాటలు అందించి, మరెన్నో రికార్డులు కూడా క్రియేట్ చేసింది సునీత. ఇకపోతే కెరియర్ పరంగా ఎంతో సక్సెస్ చూసిన సునీత వ్యక్తిగతంగా మాత్రం ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా 17 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీకి చెందిన కిరణ్ అనే వ్యక్తితో ప్రేమలో పడ్డ ఈమె.. ఇంట్లో వాళ్లను ఒప్పించాలని ఎంతో ప్రయత్నం చేసింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైనప్పటికీ కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో.. 19 సంవత్సరాల వయసులోనే కిరణ్ అనే వ్యక్తిని ప్రేమించి, అతడి కోసం ఇంట్లో వాళ్ళను కూడా కాదనుకొని, బయటకు వచ్చి అతడిని వివాహం చేసుకుంది. ఇకపోతే ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడంతో కొద్దిరోజులకు ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారట. కానీ ఏమైందో తెలియదు కానీ కొన్ని రోజులు మాట్లాడలేదని, ఆ తర్వాత అన్నీ సర్దుకున్నాయని చెప్పుకొచ్చింది సునీత.
అందుకే మొదటి భర్తకు దూరమైన సునీత..
ఇక పెళ్లయిన కొన్నాళ్ళకి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అంతా బాగుంది అనుకునే లోపే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఇక భర్త నిజస్వరూపం తెలుసుకున్న సునీత అతడికి దూరమైంది. దాంతో పిల్లల్ని తీసుకొని ఒంటరిగా జీవించడం మొదలుపెట్టింది. అయితే ఆ సమయంలోనే ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది సునీత. అందులో కొంతమంది తనను అవమానించారని హేళన చేశారని, తక్కువ చేసి చూసారని, ఇలా ఎన్నో భరించానని గతంలో సునీత చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక అలా మొదటి భర్తను ప్రేమించి, అతడి కోసం ఇంట్లో వాళ్ళను కాదని వదిలి వెళ్ళిపోయిన ఈమె, అతడి నిజస్వరూపం తెలుసుకుని దూరం అవ్వడం నిజంగా బాధాకరమనే చెప్పాలి.
రెండో పెళ్లితో సంతోషమైన జీవితం.. కానీ..
ఇక పిల్లలు ఇద్దరు ప్రస్తుతం పెద్దవాళ్ళు అయిపోయారు. తన తల్లికి కూడా ఒక తోడు కావాలని ఆలోచించిన వీరు.. సునీత ఫ్యామిలీ ఫ్రెండ్ అలాగే మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని (Ram Veerapaneni) తో 2020 డిసెంబర్ 17న నిశ్చితార్థం జరిపించారు. ఆ తర్వాత 2021 జనవరి 9న వీరి వివాహం జరిగింది. ఇకపోతే రెండవ వివాహం సమయంలో కూడా సునీతపై చాలామంది విమర్శలు గుప్పించారు. అయినా సరే తన రెండవ వైవాహిక జీవితంతో తాను ఎంతో సంతోషంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది సునీత. ఇకపోతే ఇప్పటివరకు కెరియర్ పరంగా ఏ ఒక్కరోజు విమర్శలు ఎదుర్కోని సునీత ఇప్పుడు ‘పాడుతా తీయగా’ షోలో సింగర్ ప్రవస్తి కారణంగా విమర్శలు ఎదుర్కోవడంతో అభిమానులు కూడా హర్ట్ అవుతున్నారనే చెప్పాలి. ముఖ్యంగా సునీత పక్షపాతం చూపించిందని, తనను హేళన చేసిందని , తన తల్లిని అవమానించింది అంటూ 19 ఏళ్ల సింగర్ ప్రవస్తి సీనియర్ సింగర్ సునీతపై ఆరోపణలు చేస్తుంటే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏది ఏమైనా తనపై ఉన్న మచ్చను జరుపుకోవాలని, మళ్ళీ తానేంటో ప్రూవ్ చేసుకోవాలని అభిమానులు కూడా కోరుతూ ఉండడం గమనార్హం.
also read:A.R.Rahman: ఆస్కార్ గ్రహీతకు షాక్.. కాపీ కొట్టాడంటూ కేసు.. 2 కోట్లు ఫైన్ వేసిన హైకోర్టు..!