RCB Fandom : ఐపీఎల్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. 2025 ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఎంతో నిరాశ కలిగించిన సీజన్ గా మారింది. ఇప్పటివరకు జరిగిన 8 మ్యాచ్ లలో కేవలం 2 మ్యాచ్ లలో విజయం సాధించి నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో కొనసాగుతోంది. గత మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఎదురైన ఓటమి ఈ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆర్సీబీ జెర్సీ ధరించిన ఆర్సీబీ అభిమాని ఓ చిన్నోడు చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీతో చిలిపి పని చేస్తున్నాడు. ఈ వీడియో చూస్తే ప్రతీ ఒక్కరూ నవ్వుకోవాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : IPL 2025 playoffs :ప్లేఆఫ్స్ చేరాలంటే ఎవరెన్ని గెలవాలి?
ఓరెయ్ బుడ్డొడా చెన్నై సూపర్ కింగ్స్ వాళ్లకు దొరికితే నీ పని అయినట్టే అని కొందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా వ్యవహరించాడు. గాయం కారణంగా టోర్నమెంట్ కి దూరమవ్వడం ధోని తిరిగి కెప్టెన్ గా రావడం తరువాత ఆయుష్ మాత్రే వంటి యువ ఆటగాడికి బాధ్యతలు అప్పగించాల్సి రావడం జట్టు స్థిరత్వాన్ని ప్రభావితం చేసింది. జట్టులో చాలా సమస్యలు తలెత్తుతున్నా.. వాటిలో నాలుగు ప్రధాన కారణాలే చెన్నై సూపర్ కింగ్స్ ని ఈసారి అత్యంత చెత్త ప్రదర్శనకు దారి తీశాయనే చెప్పవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ లో దూకుడైన ఆటగాళ్ల కొరత చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రచిన్ రవీంద్ర కొన్ని మ్యాచ్ లలో మెరిసినప్పటికీ మరికొన్ని మ్యాచ్ ల్లో విఫలం చెందుతున్నాడు. మరో ఓపెనర్ షేక్ రషీద్ ఇంకా అంతగా ప్రభావం చూపలేకపోయాడు. రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా వంటి అనుభవం ఉన్న ఆటగాళ్లు తమ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు. మరోవైపు టాప్ ఆర్డర్ పవర్ ప్లే లో వికెట్లు కోల్పోవడంతో మిడిల్ ఆర్డర్ పై ఒత్తిడి పెరుగుతోంది.
ఈ సీజన్ ప్రారంభం నుంచి బ్యాటింగ్ లో స్థిరత్వం లేకపోవడం స్పష్టంగా జట్టు విజయాలపై ప్రభావం చూపించింది. సీనియర్లు ఎం.ఎస్.ధోనీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ లపై ఆధారపడటం చెన్నై సూపర్ కింగ్స్ ప్రదాన సమస్యగా మారింది. ఇవాళ జరిగే మ్యాచ్ లో బ్రెవిస్ జట్టులో చేరనున్నాడు. దీంతో చెన్నై జట్టు పరిస్థితి ఏమైనా మారే అవకాశం కనిపిస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సీఎస్కే జట్టు పరిస్తితి పై సోషల్ మీడయాలో తెగ చర్చించుకుంటున్నారు. ఇటీవలే చెన్నైలో ఆర్సీబీ, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు థియేటర్ లో కొట్టుకోవడం విశేషం. తాజాగా ఓ బుడ్డోడు ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీతో డ్యాన్స్ వేసుకుంటూ ము**డ్డీ తుడుచుకోవడం విశేషం.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">