Rishabh pant: టీమిండియా సీనియర్ వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని వారసుడిగా జట్టులోకి వచ్చిన యువ కెరటం రిషబ్ పంత్. ఈ యువ ఆటగాడు అనతి కాలంలోనే స్టార్ అయ్యాడు. తన ఆటతోనే కాదు.. ప్రేమ విషయాలతోనూ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన ఓటమి అనంతరం రిషబ్ పంత్ బ్యాటింగ్ పై అనేక విమర్శలు వచ్చాయి.
కానీ ఆ సమయంలో తన ఫామ్ బాగాలేదని పంత్ వివరించాడు కూడా. ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ లో అద్భుత సెంచరీ సాధించాడు. తన సాధారణ ఆటతోపాటు చాలా ఓపికగా ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్ లో 178 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో కూడా సెంచరీ నమోదు చేశాడు. ఈ రెండు సెంచరీల తరువాత పంత్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇప్పుడు ఏకంగా పంత్ వ్యక్తిగత జీవితం గురించి కూడా మరోసారి చర్చలు తెరపైకి వచ్చాయి. ఇందులో పంత్ ప్రేమ జీవితం కూడా ఉంది. బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌటేలాతో రిషబ్ పంత్ రిలేషన్ లో ఉన్నాడని 2018 లో వార్తలు వచ్చాయి. పార్టీలకు, లంచ్ లేదా డిన్నర్ అంటూ ఇద్దరూ కలిసి తిరిగారు. దీంతో ఊర్వశి – పంత్ డేటింగ్ లో ఉన్నారని సోషల్ మీడియా కోడై కూసింది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఇద్దరు విడిపోయారు. తమ మధ్య ఏమీ లేదని పంత్ క్లారిటీ ఇచ్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి మోడల్ ఇషా నేగితో ప్రేమలో ఉన్నట్టు అధికారికంగా ప్రకటించాడు.
కానీ ఇప్పుడు రిషబ్ పంత్ ఓ టాలీవుడ్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆ హీరోయిన్ తో సెంచరీ అనంతరం పంత్ దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. నేషనల్ క్రష్ రష్మిక మందాన. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. కానీ ఇవి నిజమైన ఫోటోలు కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేసిన ఫోటోలు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. టాలీవుడ్ హీరోయిన్ పంత్ కి టైట్ హాగ్ ఇచ్చిందంటూ వైరల్ చేస్తున్నారు.
మన కళ్ళను మనమే నమ్మలేని విధంగా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఈ ఫోటోలను క్రియేట్ చేశారు. ఇటీవల కాలంలో ఇలా పలువురు సెలబ్రిటీల ముఖాలను మార్చి ఫోటోలు, వీడియోలను రూపొందించడం చూస్తూనే ఉన్నాం. ఇలా ఈ ఏఐ టెక్నాలజీని కొంతమంది దుర్వినియోగం చేసి నేరాలకు పాల్పడుతుంటే.. మరికొంతమంది మాత్రం వారి ప్రతిభకు పదును పెట్టి సరికొత్త ఆవిష్కరణలను రూపొందిస్తున్నారు. ఈ ఏఐ టెక్నాలజీ పై కొన్ని ఆందోళనలు వ్యక్తం అవుతున్నప్పటికీ.. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లుగా చూపించే ఈ ఫోటోల్లో కొన్నింటిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.