BigTV English
Advertisement

Maxwell : మాక్స్‌వెల్.. ఆ మూడు లైఫ్ లు..!

Maxwell : మాక్స్‌వెల్.. ఆ మూడు లైఫ్ లు..!

Maxwell : వన్డే చరిత్రలో ఒక అద్భుతం జరిగింది. ఇక ఆస్ట్రేలియా పనైపోయిందని అనుకున్నారు. కానీ యోధుడిలా మాక్స్‌వెల్ వచ్చాడు. అయితే  అంతా మాక్స్‌వెల్‌ని ఆకాశానికెత్తేస్తున్నారు గానీ.. మూడు లైఫ్ లు వచ్చాయన్న సంగతిని మరిచిపోతున్నారు.


వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ముంబయి వాంఖడే స్టేడియంలో ఆఫ్గనిస్తాన్-ఆస్ట్రేలియా మ్యాచ్ లో మాక్స్‌వెల్ 201 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కాకపోతే తను 33 పరుగుల వద్ద అహ్మద్ బౌలింగ్ లో సులువైన క్యాచ్ ఇచ్చాడు. బాల్ ని షార్ట్ ఫైన్ లెగ్ లో ఉన్న ఫీల్డర్ ముజీబ్ జారవిడిచాడు. చేతిలోకి పండులా వచ్చిన క్యాచ్ ని వదిలేసిన దానికి జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది.

మాక్స్‌వెల్ లైఫ్ దొరగ్గానే.. తర్వాత ఓవర్ రషీద్ ఖాన్ వేశాడు. తన బౌలింగ్ లో మరో లైఫ్ వచ్చింది. వచ్చిన బాల్ ని మాక్స్ గాల్లోకి లేపాడు. అది బౌలర్ దగ్గరలోనే ఎగిరింది. వెంటనే కవర్స్ దగ్గరున్న ఫీల్డర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు.
రషీద్ కూడా పరుగెత్తాడు. కానీ తను వస్తున్నాడని తెలిసి ఆగిపోయాడు. కానీ తను బాల్ కన్నా వేగంగా పరుగెత్తడంతో.. ఆ స్పీడులో చేతిలో పడిన దాన్ని వదిలేశాడు. అలా రెండోది నేలపాలైంది.


ఆ రెండో క్యాచ్ మిస్ అయిన వెంటనే, అదే ఓవర్ లో మాక్స్ మళ్లీ నిర్లక్ష్యపు షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బాల్ బ్యాట్ కి తగలకుండా ప్యాడ్ కి తగిలింది. ఆఫ్గాన్లు ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేశారు. వెంటనే అంపైర్ అవుట్ అని చూపించాడు. అయితే మాక్స్‌వెల్ ఎందుకైనా మంచిదని డీఆర్ఎస్ కి వెళ్లాడు. అయితే అందులో బాల్ ప్యాడ్ కి తగిలింది కానీ కొంచెం వికెట్ల పై నుంచి వెళ్లింది. దీంతో నాటౌట్ గా ప్రకటించారు.

అలా అంపైర్ ఇచ్చిన అవుట్ నుంచి బతికి బట్టకట్టి.. ఏకంగా 201 పరుగులు చేసి నాటౌట్ గా ఉండటమే కాదు.. ఆస్ట్రేలియాను తీసుకెళ్లి సెమీస్ లో కూర్చో బెట్టాడు. ఒకవేళ 33 పరుగుల వద్ద అవుట్ అయి ఉంటే, పరిస్థితి వేరేగా ఉండేదని అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ క్యాచ్ ఇచ్చేసమయానికి ఆస్ట్రేలియా స్కోరు 112. మాత్రమే ఇంకా 180 పరుగులు చేయాలి. అది మిగిలిన రెండు వికెట్లతో దాదాపు అసాధ్యం అనే సంగతి అందరికీ తెలిసిందే.

చాలామంది క్రీడాకరులు ఒక్క లైఫ్ దొరకగానే ఇంక జాగ్రత్త పడిపోతారు. మరో అవకాశం ఇవ్వకుండా ఆడతారు. అందుకే క్రికెట్ లో ఒక నానుడి ఉంది. అదేమిటంటే ‘క్యాచెస్ విన్ మ్యాచెస్’. అంటే క్యాచ్ లు పడితే మ్యాచ్ లు గెలవచ్చు అని దాని సారాంశం. ఒక్క క్యాచ్ మిస్ చేసినా అది జట్టు ఫలితాన్నే మార్చేస్తుందనేది ఎన్నో సందర్భాల్లో రుజువైంది.

తాజాగా ఇదే 2023 వరల్డ్ కప్ లో పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ ఇలాగే 16 పరుగుల వద్ద సులువైన క్యాచ్ ఇచ్చాడు. జట్టులోకి కొత్తగా వచ్చిన పాకిస్తాన్ బౌలర్ ఉసామా మిర్ దానిని వదిలేశాడు. దాంతో ఆ మ్యాచ్ లో వార్నర్ 160 పరుగులు చేసి, ఒక్క ఎగురు ఎగిరి తగ్గేదేలే అన్నాడు. అందరూ మ్యాచ్ ని మరిచిపోయినా వార్నర్ మూమెంట్ ని ఎవరూ మరిచిపోలేకపోతున్నారు. దీనిని బట్టి అర్థమైందేమిటంటే..ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ తో ఏ జట్టు అయినా సరే, ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడాలి.

Related News

RCB For Sale: RCB పేరు మార్పు, ఇక‌పై ZCB…బెంగ‌ళూరు జ‌ట్టుకు కొత్త ఓన‌ర్ ఎవ‌రంటే ?

IND VS SA: ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్, షెడ్యూల్‌, బ‌లాబ‌లాలు ఇవే..ఉచితంగా ఎలా చూడాలంటే

Hong Kong Sixes 2025 : హార్దిక్ పాండ్యాను కాపీ కొట్టిన పాకిస్తాన్..ఛీ.. ఛీ ఎంతకు తెగించార్రా

IPL 2026: SRH జ‌ట్టులో ఫిక్సింగ్..అంబానీతో చేతులు క‌లిపి ద‌గా, కావ్యపాప స్కెచ్ చూడండి !

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్‌, వేదిక‌లు ఇవే…హైద‌రాబాద్, విశాఖ‌కు అన్యాయం ?

Cricket players : ఇప్ప‌టి క్రికెట‌ర్లు ఆ వైట్ క్రీమ్ ను ఎందుకు వాడ‌టం లేదో తెలుసా..?

IPL 2026-SSMB 29 : ఐపీఎల్ ఫ్యాన్స్ కు చిచ్చులు పెడుతున్న మహేష్-జక్కన్న, వేలం ఎప్పుడంటే?

Hong Kong Sixes 2025 Final: హాంకాంగ్‌ సిక్సెస్ 2025 విజేత‌గా పాకిస్తాన్..6వ సారి ట్రోఫీ, ప్రైజ్ మ‌నీ ఎంతంటే

Big Stories

×