BigTV English

Glenn Maxwell : మాక్స్‌వెల్ వీరోచితం.. ఒంటి కాలితో ఊచకోత..

Glenn Maxwell : మాక్స్‌వెల్ వీరోచితం.. ఒంటి కాలితో ఊచకోత..

Glenn Maxwell : ఒంటిచేత్తో సముద్రాన్ని ఈదాడని ఒక నానుడి ఉంది. ఆ మాటను ఈరోజు క్రికెట్ లో మాక్స్ వెల్ నిజం చేసి చూపించాడు. ఒంటిచేత్తో సముద్రాన్ని కాదు.. ఒంటి కాలితో మ్యాచ్ ను గెలిపించాడు. రెండు కాళ్లు, చేతులు, కళ్లు అన్నీ శుభ్రంగా ఉండి ఆడటం వేరు, కానీ  అందరి బ్యాటర్లలా ఆడలేదు. ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు. సెంచరీ వరకు పూర్త సామర్థ్యంతోనే ఆడాడు.


కానీ తర్వాత నుంచి ఫిట్ నెస్ సమస్యలు వచ్చాయి. పరుగెత్తలేని స్థితిలో లాంగాన్ లోకి ఒక సిక్స్ కొడుతున్నప్పుడు సడన్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో బాధ ఓర్చుకుంటూ అలా కుంటుకుంటూనే పరిగెత్తాడు. మొత్తానికి కాలు విదిల్చి, అటు చేసి, ఇటు చేసి చాలాసేపు ప్రయత్నించాడు. నొప్పిని ఓపికగా భరించాడు. కానీ  41 ఓవర్ లో ఒక సింగిల్ తీస్తూ గ్రౌండ్ లోనే విలవిల్లాడుతూ పడిపోయాడు. వెంటనే ఫిజియో థెరఫిస్టు వచ్చి పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. తర్వాత షూస్ కూడా మార్చారు. కానీ ఎంత చేసినా ఆ బాధ మాత్రం తగ్గలేదు. చాలా సందర్భాల్లో సింగిల్స్ తీయకుండా, పంటికింద బాధను అణిచి పెడుతూ షాట్స్ కొట్టడానికే ప్రయత్నించాడు. ఒకరకంగా చెప్పాలంటే చాలా మొండిగా ఆడాడు.

మరోవైపు నొప్పికి తోడు తీవ్ర అలసట కూడా తోడైంది. ఒక దశలో క్రీజులో నిలిచేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అలాంటి స్థితిలో తట్టుకుంటూ మైదానం నలువైపులా ఒంటికాలిపైనే స్ప్రింగ్ లా గిర్రుమని తిరుగుతూ ఫటాఫట్ మని సిక్స్ లు, ఫోర్లు కొట్టుకుంటూ వెళ్లిపోయాడు. ఇక బాధ భరించలేక తను కూడా ఏదో ఒక షాట్ కొట్టి అవుట్ అయిపోవాలనే ఉద్దేశంతోనే.. ఒక దశలోనే ఆడినట్టుగా అనిపించింది. కానీ అవన్నీ అదృష్టవశాత్తూ స్టాండ్ అవతలే పడ్డాయి.


తన మార్క్ ఫేవరెట్ షాట్స్ స్కూప్, రివర్స్ స్వీప్, గోల్ఫ్ షాట్లను శుభ్రంగా కొట్టాడు. ఒక్కమాటలో చెప్పాలంటే క్రీజులో తీరిగ్గా నిల్చోని మ్యాచ్ ఫినిష్ చేశాడు. బాధతో నొప్పిని తను అనుభవించాడేమో గానీ, షాట్స్ ఆడేటప్పుడు మాత్రం చాలా సౌకర్యంగా గ్రౌండ్ లోకి కొట్టేశాడు. అలా ఒంటికాలితోనే సముద్రాన్ని ఈదినట్టు కొండంత స్కోరుని ఉఫ్ మని ఊదేశాడు. ఒక చారిత్రాత్మకమైన ఇన్నింగ్స్ ఆడాడు.  

Related News

Asia Cup 2025 : అభిషేక్ శర్మ రనౌట్… దుబాయ్ స్టేడియంలో ఏడ్చేసిన లేడీ

Team India : వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక..వైస్ కెప్టెన్ గా జ‌డేజా..షెడ్యూల్ ఇదే

IND Vs AUS : ఆస్ట్రేలియాతో సిరీస్… టీమిండియా కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్

Asia Cup 2025 : టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై విమర్శలు…గంభీర్ పై సంజూ సీరియస్?

Pak vs Ban: ఇవాళే బంగ్లా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌…గెలిస్తే ఫైన‌ల్స్‌, ఓడితే ఇంటికే

BCCI: బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇక ఈ ఇద్ద‌రూ పాక్‌ క్రికెట‌ర్ల కెరీర్ క్లోజ్‌

IND vs BAN: పసికూన బంగ్లాదేశ్ పై పంజా…ఆసియా కప్ ఫైనల్స్ కు టీమిండియా..ఇంటికి శ్రీలంక

IND vs BAN: త‌డ‌బ‌డిన టీమిండియా…బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే ?

Big Stories

×