Intinti Ramayanam Today Episode October 18th : నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్రప్రసాద్ ని మళ్ళీ ఇలా చూస్తామని అనుకోలేదు అంటూ భానుమతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయితే రాజేంద్రప్రసాద్ సంతోషంగా ఉండాలని లేకపోతే మళ్లీ ఆరోగ్యం పాడవుతుంది అని అవని అంటుంది. వీళ్ళందరూ సంతోషంగా ఉన్న టైంలో పల్లవి పంపించిన మనిషి మీతో నేను మాట్లాడొచ్చా అని అవనిని అడుగుతాడు. మీరు ఈరోజు ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని డెడ్లైన్ విధిస్తాడు. మావయ్య గారికి హెల్త్ బాలేదండి ఇప్పుడే ఇంటికి వచ్చాము ఒక నాలుగు రోజులు టైం ఇవ్వండి అని అవని.
మీలాంటి వాళ్ళు ఇలానే సాకులు చెప్తారు ఇవన్నీ నా దగ్గర కుదరవు. మీకు ఆల్రెడీ రెండు రోజులు ముందే చెప్పాను ఇప్పుడు ఖాళీ చేసి వెళ్లి పోవాల్సిందే మీకు ఇంకొక రెండు మూడు గంటలు టైం ఇస్తాను అని అతను అంటాడు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావ్ ఒక నాలుగు రోజులు అడిగాను కదా ఎందుకు ఎక్కువ చేస్తున్నావ్ అని కమల్ సీరియస్ అవుతాడు. పార్వతి ఒక నాలుగు రోజుల తర్వాత వెళ్తాం బాబు మీరు పెద్దమనిషి చేసుకొని సహాయం చేయండి అని అడుగుతుంది.. ఇదంతా నాకు తెలియదమ్మా మీరు ఖాళీ చేయాల్సిందే అని అతను అంటాడు. అవని తన కుటుంబంతో వేరే ఇంటికి వెళుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రాజేంద్రప్రసాద్ కుటుంబం ఓ ఇంటిని చూసుకొని అక్కడ ఉండాలని అనుకుంటారు.. ఆ ఇంటిని చూసి అవని బాగానే ఉంది మావయ్య మనం ఇక్కడే ఉన్నాము అని అంటుంది. అవని ఇంటి డబ్బులు కట్టడానికి చాలా కష్టపడుతుంది అని రాజేంద్రప్రసాద్ అనుకుంటూ ఉంటాడు. పార్వతి రాజేంద్రప్రసాద్ కి ఒక గది చూపించి మీరిద్దరూ ఇక్కడ ఉండండి అనేసి అంటుంది. దానికి ఇంత పెద్ద గది మాకెందుకమ్మా అని పార్వతి అంటుంది. ఇంటిని గడపడానికి ఎలా అని ఆలోచిస్తున్నాను అవని నువ్వు గనుక లేకపోతే ఆ డబ్బులు కూడా ఉండేవి కాదు కదా అని రాజేంద్రప్రసాద్ అంటాడు.
అక్షయ్ అవని లేకపోతే కచ్చితంగా ఎవరు ఇంట్లో ఉండేవారు కాదు రోడ్డుపై ఉండేవారు అని ఆలోచిస్తూ ఉంటాడు. అవని కష్టపడి ఉద్యోగం చేసే సంపాదిస్తుంది అంటూ తనపై సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది. ఇక పల్లవిని తీసుకురావడం గురించి పార్వతీ రాజేంద్రప్రసాద్ తో అవని మాట్లాడుతుంది. నువ్వు వెళ్తే ఖచ్చితంగా సీరియస్ గా ఉంటుంది కాబట్టి రాదు. నేను వెళ్లి తీసుకొస్తాను అని అంటాడు. నువ్వు తన విషయాల గురించి బయట పెట్టావని నిజంగానే నీ మీద కోపంగా ఉంటుంది వదిన అని ప్రణతి అంటుంది.
పర్లేదు నన్ను ఎన్నన్నా కూడా ఈ కుటుంబం కోసం పడతాను పల్లవిని వెళ్లి తీసుకొని వద్దాము అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చి నాకు కమల్ పల్లవిని మీరు తీసుకురావడం నాకు అస్సలు ఇష్టం లేదు వదినా అని అంటాడు. తన వల్ల ఇంట్లో మళ్ళీ గొడవలు రావడం నాకు నచ్చదు. అసలు తన మొహం చూడాలన్నా కూడా నాకు ఇష్టం లేదు అని కమల్ అంటాడు. కన్నయ్య నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు మీ నాన్నగారి గురించి కానీ ఇంటి గురించి కానీ నువ్వు ఆలోచించట్లేదు అని అవని అంటుంది.
అది కాదు వదిన పల్లవి వస్తే మళ్లీ సంతోషంగా ఉన్న ఇంట్లో మళ్లీ గొడవలు సృష్టిస్తుంది. తను వద్దు అని ఎంత చెప్పినా సరే నువ్వు ఏం మాట్లాడద్దు కన్నయ్య నా మాట మీద నీకు గౌరవం అంటే నువ్వు లోపలికి వెళ్ళు అని అవని అంటుంది. ఉదయం లేవగానే ప్రణతి భానుమతికి కాఫీ ఇచ్చి రాజేంద్రప్రసాద్ కి జ్యూస్ ఇస్తుంది.. అయితే రాజేంద్రప్రసాద్ ఇవాల్టికి నాకు కాఫీ కావాలమ్మా అని బ్రతిమలాడుతాడు కానీ ప్రణతి మాత్రం మీకున్న ఆరోగ్య సమస్యలు కారణంగా మీకు కాఫీ ఇవ్వడం కుదరదు అని అంటుంది.
అప్పుడే అక్కడికి అవని అక్షయ్ పల్లవిని తీసుకురాడానికి వెళ్తున్నామని అంటారు. కానీ కమల్ మాత్రం మీరు పల్లవిని తీసుకురావడానికి కుదరదు వీల్లేదు అని అంటాడు. ఎందుకు వెళ్ళలేదు నువ్వు ఏమి మాట్లాడద్దు అని అవని అంటుంది. చూస్తే నాకు చంపేయాలి అనిపిస్తుంది తను చేసిన విషయాలన్నీ తలుచుకుంటుంటే నాకు కోపం పెరుగుతుంది వదిన అని అంటాడు. తను వస్తే మళ్లీ ఇంట్లో గొడవలు సృష్టిస్తుంది అని కమలంటాడు. అప్పుడే అక్కడికి పల్లవిని చూసి అందరూ షాక్ అవుతారు.
Also Read : సినీ దర్శకుడు ఆర్జీవి పై హిందువులు ఆగ్రహం.. పోలీస్ కేసు నమోదు..
పల్లవి అక్కడే ఉన్నావేంటి రా లోపలికి అని అవని వెళ్లు పిలుస్తుంది. కానీ అని పల్లవి మాత్రం లోపలికి రాగానే ఏంటి బావ నన్ను చూస్తే నీకు చంపేయాలని అనిపిస్తుందా..? భార్య మీద ప్రేమ ఉన్నోడు ఎవడు ఇలా మాట్లాడడు.. నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నీ దృష్టిలో నేను ఏంటో అర్థం అయిపోయింది. అందుకే నువ్వు నన్ను ఇంట్లోకి రానివ్వడం కాదు. నేనే నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని వచ్చానని పల్లవి అంటుంది. పల్లవి ఇచ్చిన డివోర్స్ నోటీస్ చూసి కమల్ షాక్ అవుతాడు.. అవని ఆ నోటీసులు తీసుకొని నువ్వు కమల్ కి విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నావా? కొంచమైనా మతి ఉండి ఆలోచించు అని అందరూ పల్లవిని అంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..