BigTV English

Stephen Fleming: RCB చేతిలో ఓడినా… సింహంలా దూసుకు వస్తాం.. అందరి భరతం పడతాం !

Stephen Fleming: RCB చేతిలో ఓడినా… సింహంలా దూసుకు వస్తాం.. అందరి భరతం పడతాం !

Stephen Fleming: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025లో భాగంగా శుక్రవారం రోజు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే} కి చెపాక్ స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు {ఆర్సిబి} చేతిలో ఓటమి ఎదురైంది. ఐపీఎల్ ప్రారంభ సీజన్ 2008 లీగ్ తర్వాత చెన్నైకి ఇది తమ సొంత మైదానంలో ఆర్సిబి చేతిలో ఎదురైన తొలి పరాజయం. ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ కి ఈ సీజన్ లో తొలి పరాజయం నమోదయింది. 17 సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం చెపాక్ లో జయకేతనం ఎగురవేసింది ఆర్సిబి.


 

ఈ నేపథ్యంలో ఆర్సిబి ఆటగాళ్లతో పాటు అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. మరోవైపు సొంత గడ్డపై ఆర్సిబి చేతిలో పరాభవాన్ని సీఎస్కే జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కి చేదు అనుభవం ఎదురైంది. స్టీఫెన్ ఫ్లెమింగ్ కి ఎదురైన ప్రశ్న కాస్త ఆగ్రహాన్ని తెప్పించింది. చెన్నై బ్రాండ్ క్రికెట్ పాతబడింది అనే వాదనను ఫ్లెమింగ్ కొట్టి పడేశాడు.


మ్యాచ్ అనంతరం కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కి ఓ రిపోర్టర్ వేసిన ప్రశ్న.. ఆయనకు అసహనాన్ని కలిగించింది. రిపోర్టర్.. ” తొలి మ్యాచ్ లో 156 పరుగుల లక్ష్యాన్ని చివరి ఓవర్ లో చేదించారు. ఇప్పుడు 146 పరుగులే చేశారు. చెన్నై బ్రాండ్ క్రికెట్ పాతబడిపోయిందని మీకు అనిపించడం లేదా..?” అని ప్రశ్నించాడు. దీనికి చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సమాధానం ఇస్తూ.. ” మా క్రికెట్ ఆడే తీరుపై మీ ఉద్దేశం ఏంటి..? మీరు ఫైర్ పవర్ గురించి మాట్లాడారు.

మన దగ్గర ఫైర్ పవర్ అంతా ఉంది. మీ ప్రశ్నలో అర్థం లేదు. ఎందుకంటే మేము మొదటి బంతి నుంచే స్వింగ్ చేయలేదు. అలాగే అదృష్టం కూడా కలిసి రావాలి. చివరికి విజేత ఎవరో చూడాలి. మాది పాజిటివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. మమ్మల్ని తక్కువగా అంచనా వేయకండి” అంటూ ఘాటు రిప్లై ఇచ్చారు. దీనికి రిపోర్టర్ మళ్ళీ.. ” నేను మిమ్మల్ని తక్కువ అంచనా వేయడం లేదు” అని అన్నాడు.

దీనికి కోచ్.. ” మీ ప్రశ్న సిల్లీగా అనిపిస్తుంది. కొన్ని సంవత్సరాలుగా చెపాక్ స్టేడియం గురించి మాట్లాడుతూనే ఉన్నాను. ఇక్కడ హోమ్ అడ్వాంటేజ్ అనే విషయం ఉండదు. మేము ఇతర వేదికలలో కూడా విజయాలు సాధించాం. ప్రతి మ్యాచ్ ఒక కొత్త సవాల్. పిచ్ ని అర్థం చేసుకుని సరైన జట్టును ఎంపిక చేయాలి. అయితే కొన్నిసార్లు అంచనా తప్పు కావచ్చు” అని ఫ్లెమింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

 

ఆర్సిబి పై ఓడిపోయినంత మాత్రాన తమను తక్కువగా అంచనా వేయవద్దని.. చివరికి ఐపీఎల్ ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కి దిగిన ఆర్సిబి నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు సాధించింది. అనంతరం లక్ష చేదనకు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగుల వద్ద నిలిచిపోయింది. ఫలితంగా 50 పరుగుల తేడాతో ఆర్సీబీ చేతుల్లో ఓడిపోయింది.

Tags

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×