Ahmed Shehzad: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం లో ( Narendra Modi Stadium, Ahmedabad) టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల ( India vs New Zealand, Final) మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో 96 పరుగులు తేడాతో విజయం సాధించిన టీమిండియా, ముచ్చటగా మూడోసారి టైటిల్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే భారత దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే టీమిండియా టైటిల్ అందుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు.
టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) విజేతగా టీమిండియా నిలిచిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఓపెనర్ అహ్మద్ షెజాద్ ( Ahmed Shehzad ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా అత్యంత బలంగా ఉందని.. వాళ్ల టెయిలెండర్లు కూడా 250 పరుగులు సులభంగా చేస్తున్నారని పేర్కొన్నారు. టీమిండియా టెయిలెండర్లు కూడా భారీగా పరుగులు చేయడం వెనుక ఏదో గత పెద్దగా ఉందని బాంబు పేల్చారు. అయితే టీమిండియా ఇంత బలంగా ఆడడం మాత్రం చాలా గ్రేట్ అంటూ కితాబిచ్చారు. టీమిండియా లోయర్ ఆర్డర్ ను చూసి పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోవాలని ఫైర్ అయ్యారు. కెన్యా, ఉగాండా, యూఏఈ, జింబాబ్వే లాంటి చిన్న జట్లను తమ దేశానికి పిలిపించుకోవడం.. వాళ్లపై గెలవడం తప్ప పాకిస్తాన్ పీకిందేమీ లేదని ఫైర్ అయ్యారు. ఇండియా లాగా పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఆడడం లేదని మండిపడ్డారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ (PSL ) వచ్చిన తర్వాత ఎవడికి వాడే హీరో అన్నట్లుగా ఫీల్ అవుతున్నారని నిప్పులు చెరిగారు. చాలా రోజులుగా పాకిస్తాన్ క్రికెట్ లో ఇదే తాతంగం జరుగుతోందని మండిపడ్డారు. కానీ టీమిండియా మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను ( IPL) వాడుకొని ముందుకు దూసుకు వెళ్తుందని తెలిపారు. అందుకే వరుసగా ట్రోఫీలు గెలుస్తోందని గుర్తు చేశారు. టీమిండియా ప్లేయర్లు చరిత్ర తిరగరాస్తుంటే… పాకిస్తాన్ మాత్రం చతికల పడిందని విమర్శలు చేశారు. ఇకనైనా పాకిస్తాన్ ప్లేయర్లు బుద్ధి తెచ్చుకోవాలని.. లేకపోతే ఉరేసుకొని చావాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పాకిస్తాన్ మాజీ ఓపెనర్ అహ్మద్ షెజాద్. ఇది ఇలా ఉండగా t20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో సూపర్ 8 దశలో పాకిస్తాన్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. సూపర్ 8 దశలో ఎలిమినేట్ అయిన పాకిస్తాన్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుంచి 3.48 కోట్లు దక్కాయి.
🚨 AHMED SHEHZAD CRYING AFTER INDIA WIN AND BASHED PAKISTAN CRICKET 🚨
Ahmed Shehzad said 🗣️
"Look, even Indian tailenders score 250. They manage to put up a total like that. Just look at them!
Our only problem now is that we invite smaller teams—UAE, Uganda, Kenya,… pic.twitter.com/1j8AVks0gU
— Cricket Central (@CricketCentrl) March 9, 2026