E-Paper
Advertisement

Romantic Web series : డిజిటల్ బాయ్‌ఫ్రెండ్స్‌తో డేటింగ్… నచ్చినోడి కోసం నానా తంటాలు…ఓటీటీలోకి రొమాంటిక్ కొరియన్ సిరీస్

Romantic Web series : డిజిటల్ బాయ్‌ఫ్రెండ్స్‌తో డేటింగ్… నచ్చినోడి కోసం నానా తంటాలు…ఓటీటీలోకి రొమాంటిక్ కొరియన్ సిరీస్
Advertisement

Romantic Web series : ఇప్పుడు కొరియన్ సిరీస్ లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎన్ని ఎపిసోడ్లు ఉన్నా, చూడడం మొదలుపెడితే అస్సలు ఆపటంలేదు. వీటిలో రొమాంటిక్ స్టోరీలను విపరీతంగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రీసెంట్గా ఒక కొరియన్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఒక డేటింగ్ యాప్ చుట్టూ తిరిగే ఈ స్టోరీ మస్త్ మజా ఇస్తోంది ఆడియన్స్ కి. ఇందులో ఒక్కో ఎపిసోడ్ లో ఒక కొత్త బాయ్ ఫ్రెండ్ వస్తాడు హీరోయిన్ కి. సింపుల్‌గా చెప్పాలంటే.. స్మార్ట్‌ఫోన్‌లో దొరికే సాఫ్ట్‌వేర్ ప్రేమ కంటే, పక్కనే ఉండే మనిషి ఇచ్చే హార్డ్‌వేర్ ప్రేమే మిన్న అని తేల్చి చెప్పే కథ ఇది. మరి వింటూ ఉంటేనే ఏదోలా ఉంది కదా. చూస్తే మాత్రం భలే బాగుంటుంది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా సిరీస్ పేరు ‘బాయ్‌ఫ్రెండ్ ఆన్ డిమాండ్’ (Boyfriend on Demand). కిమ్ జంగ్-సిక్ దర్శకత్వంలో జిసూ, సియో ఇన్-గుక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది మొత్తం 10 ఎపిసోడ్ల సిరీస్. ప్రతి ఎపిసోడ్‌లో ఒక కొత్త బాయ్‌ఫ్రెండ్‌గా సియో కాంగ్-జూన్, లీ జే-వూక్, లీ సూ-హ్యుక్ వంటి ప్రముఖ నటులు కనిపిస్తారు. ఇది 2026 మార్చి 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సిరీస్‌ను దక్షిణ కొరియాతో పాటు ఫిలిప్పీన్స్‌లోని సెబు లో కూడా చిత్రీకరించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

హీరోయిన్ మి-రే ఒక వెబ్‌టూన్ ఆఫీసులో పనిచేస్తుంటుంది. పైన బాస్ టార్చర్‌, కింద పని ఒత్తిడితో లైఫ్ అంతా చిందరవందరగా ఉంటుంది. ఈ గందరగోళంలో తనకి తోడుగా ఎవరూ లేరని ఫీలవుతూ, ఒక ‘బాయ్‌ఫ్రెండ్ ఆన్ డిమాండ్’ అనే వింత డేటింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటుంది. ఇక అంతే.. ఆ యాప్‌లో మనకి నచ్చిన టైపులో బాయ్‌ఫ్రెండ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కోసారి డాక్టర్, ఒక్కోసారి సీక్రెట్ ఏజెంట్, ఇలా వెరైటీ వెరైటీ మనుషులతో అమ్మడు డిజిటల్ లోకంలో తెగ రొమాన్స్ చేసేస్తుంటుంది.

కట్ చేస్తే, కళ్ళ ముందు హీరో పార్క్ క్యోంగ్-నమ్ ఎంట్రీ ఇస్తాడు. వీళ్లిద్దరికీ అస్సలు పడదు. ఆఫీసులో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటేనే మంటలు పుడతాయి. కానీ వీళ్లిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ మీద ఫిలిప్పీన్స్‌కి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ వీళ్ల మధ్య జరిగే గొడవలు, పీకలదాకా తాగేసి చేసే హంగామాతో కథ అసలు ట్రాక్‌లోకి ఎక్కుతుంది.

Advertisement

చివరికి ఏం జరుగుతుందంటే.. ఆన్‌లైన్‌లో కనిపించే బాయ్ ఫ్రెండ్స్ కంటే, తిట్టుకున్నా కొట్టుకున్నా కష్టాల్లో తోడుండేవాడే అసలైన మొగుడని హీరోయిన్‌కి అర్థమవుతుంది. చివరికి వీళ్లిద్దరి లవ్ ట్రాక్ ఓకే అవుతుందా ? అసలు ఆ యాప్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? అనే విషయాలను మాత్రం ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : తండ్రిని జైలుకు పంపే కూతురు… భర్త కోసం భార్య ఎదురుచూపులు… ఏడిపించే ఎమోషన్స్ కూడా

Tags

Related News

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

రిజర్వాయర్ నీళ్లలో నక్కిన భయంకరమైన శక్తులు… వణికించే కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×