BigTV English

Indian Cricketers: కూరగాయలు, ఛాయ్, వడాపావ్ అమ్ముకుంటున్న టీమిండియా క్రికెటర్లు.. ఈ వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే!

Indian Cricketers: కూరగాయలు, ఛాయ్, వడాపావ్ అమ్ముకుంటున్న టీమిండియా క్రికెటర్లు.. ఈ వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే!

Indian Cricketers: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ {AI}.. ప్రస్తుత కాలంలో అత్యధిక మందిలో ఆసక్తి రేకెత్తించిన అధునాతన టెక్నాలజీ ఇదే. అనేక రంగాలలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తన ప్రాధాన్యతను పెంచుకుంటూ పోతుంది. ముఖ్యంగా వైద్య రంగంలో ఏఐ టూల్స్ అందుబాటులోకి రావడంతో.. ఆయా సేవలో క్వాలిటీ అండ్ స్పీడ్ అప్ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ ఆధారిత రోబోలు, చాట్ బాక్స్.. ఈ తరం యువతకు అనేక అంశాలలో నైపుణ్యాలు పెంచుకోవడానికి ఎంతగానో సహాయపడుతున్నాయి.


Also Read: Shuman Gill: వివాదంలో గిల్.. Nike కంపెనీ టీషర్ట్ వేసుకొని అడ్డంగా దొరికిపోయాడుగా!

అయితే ఈ ఏఐ ఎంట్రీ తో కొంతమంది ఉద్యోగాలు కోల్పోతుంటే.. మరోవైపు నెట్టింట సంచలనాలకు వేదిక అవుతుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రపంచాన్ని శాసించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ టెక్నాలజీ చేయని అద్భుతం లేదంటూ దూసుకుపోతుంది. ఈ రోజుల్లో ఎంత చిన్న పని చేయాలన్నా ఈ టెక్నాలజీ ఉండాల్సిందే. దీంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడుతుంది. ముఖ్యంగా ఇందులో అందరికంటే భారత్ మరీ ఎక్కువగా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తుంది.


ఏ.ఐ టెక్నాలజీ వల్ల లాభమా..? నష్టమా..?

అయితే ఈ ఏఐ టెక్నాలజీ సృష్టిస్తున్న అద్భుతాలకు ప్రస్తుతం అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఒక్కటేమిటి.. దాదాపు అన్ని రంగాల్లోనూ ఈ ఏఐ తన సత్తా చాటుతూ.. మరీ ముఖ్యంగా వీడియో మేకింగ్ లో ఏఐ అద్భుతాలు క్రియేట్ చేస్తోంది. ఈ టెక్నాలజీ పై సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ మరియు నెగటివ్ చర్చలు కూడా జరిగాయి. దీనిని కొంతమంది మంచి కోసం వాడుతుంటే.. మరికొంతమంది మాత్రం చెడు కోసం వాడుతున్నారు. దీంతో ఈ టెక్నాలజీ వల్ల నష్టాలు తప్ప లాభం లేదని పలువురు సోషల్ మీడియాలో వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది మార్పును స్వాగతించాల్సిందేనని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా ఈ టెక్నాలజీ సెలబ్రిటీలకు శాపంగా మారిందని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే వారిని వివిధ రకాలుగా మార్చుతూ క్రియేట్ చేస్తున్న ఫోటోలు అటు సెలబ్రిటీలను, ఇటు వారి అభిమానులను ఆందోళనకు గురి చేసేలా ఉంటున్నాయి.

టీమిండియా క్రికెటర్ల ఫోటోలు వైరల్:

తాజాగా టీమిండియా క్రికెటర్లకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా.. సన్నగా ఉన్న క్రికెటర్లను మరీ లావుగా చూపించి క్రియేట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈ వీడియోని పలువురు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. టీమిండియా క్రికెటర్లు ఎంత ఫిట్ గా ఉంటారో మనకు తెలిసిందే. అలాంటి వారిని లావుగా అయితే వారు ఎలా ఉంటారో.. వారి ఫోటోలను ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Also Read: Harry Brook warning: ఇంగ్లాండ్ అంటే గిల్ వణికిపోతున్నాడు.. 1000 పరుగులు టార్గెట్ ఉన్న ఛేదిస్తాం..బ్రూక్ స్ట్రాంగ్ వార్నింగ్!

ఇలా వైరల్ గా మారిన ఫోటోలలో.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టి అమ్ముతున్నట్లుగా, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బట్టలు ఉతుకుతున్నట్లుగా, లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేపర్ అమ్ముకుంటున్నట్లుగా, సంజూ శాంసన్ కొబ్బరి బోండాలు అమ్ముకుంటున్నట్లుగా, సౌరవ్ గంగూలీ కూరగాయలు అమ్ముకుంటున్నట్లుగా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వడపావ్ అమ్ముకుంటున్నట్టుగా, హార్దిక్ పాండ్యా ఫ్రూట్స్ అమ్ముకుంటున్నట్టుగా.. పలు ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటోలను చూసిన వారి అభిమానులు.. తీవ్రస్థాయిలో అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

?utm_source=ig_web_copy_link

Related News

IND Vs SL : టాస్ గెలిచిన శ్రీలంక‌.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : ఇండియా వర్సెస్ పాక్ ఫైనల్..PVR సంచలన నిర్ణయం.. ఏకంగా 100 థియేటర్స్ లో

Asia Cup 2025 : ఒకే గొడుగు కిందికి పాకిస్తాన్, బంగ్లా ప్లేయర్స్… ఇద్దరు ఇండియాకు శత్రువులే.. క్రేజీ వీడియో వైరల్

Shoaib Akhtar : ఇండియాకు ఇగో ఎక్కువ‌.. ఆదివారం మొత్తం దించేస్తాం..ఇక కాస్కోండి !

IND Vs PAK : ఆసియా కప్ ఫైనల్ కంటే ముందు పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. హరీస్ రవుఫ్ పై బ్యాన్..!

India vs Pakistan Final: ఇండియాను వ‌ద‌ల‌కండి…చంపేయండి అంటూ రెచ్చిపోయిన పాక్ ఫ్యాన్‌..హరీస్ రవూఫ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి !

Asia Cup 2025 : పాక్ చెత్త ఫీల్డింగ్.. మ‌రోసారి రుజువైంది..చేతులారా వ‌చ్చిన రనౌట్ వ‌దిలేశారుగా

India vs Pakistan final: టీమిండియా, పాక్ మ‌ధ్య ఫైన‌ల్స్‌… 41 ఏళ్లలో తొలిసారి…రికార్డులు ఇవే..ఫ్రీగా చూడాలంటే?

Big Stories

×