Harry Brook warning: ఇంగ్లాండ్ లోని ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్ ఉత్కంఠగా సాగుతోంది. రెండవ టెస్ట్ తొలి రోజు నుండి భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయానికి చాలా దగ్గరగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో అద్భుత ప్రదర్శన చేసిన భారత బ్యాటర్లు.. 587 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్ లో కెప్టెన్ గిల్ {269}, యశస్వి జైస్వాల్ {87}, రవీంద్ర జడేజా {89}, వాషింగ్టన్ సుందర్ {42} పరుగులతో ఆకట్టుకున్నారు.
Also Read: IPL Players: ఐపీఎల్ ప్లేయర్లకు కొత్త వ్యాధి వచ్చిందా… ఇలా బక్కగా అయిపోయారు ఏంటి?
ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్ 3, టంగ్ 2, వోక్స్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 407 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 6, ఆకాష్ దీప్ 4 వికెట్లు పడగొట్టి.. ఇంగ్లాండ్ ని దెబ్బకొట్టారు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో మొత్తం ఆరుగురు డక్ ఔట్ అయినా.. హ్యారీ బ్రూక్ {158}, జేమి స్మిత్ {184*} పరుగులతో రాణించారు.
ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం:
ఇక రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 83 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 427 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. రెండవ ఇన్నింగ్స్ లోను కెప్టెన్ గిల్ {161} పరుగులతో రాణించాడు. అలాగే రిషబ్ పంత్ {65}, రవీంద్ర జడేజా {69*} పరుగులు చేశారు. దీంతో భారత్.. ఇంగ్లాండ్ ముందు 608 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇక నాలుగవ రోజు ఈ 608 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో మూడు వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. జాక్ క్రాలీ {0}, బెన్ డెకెట్ {25}, జో రూట్ {6} పరుగులు చేసి పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో ఆకాష్ దీప్ 2, మహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం క్రీజ్ లో పోప్ {24*}, బ్రూక్ {15*} ఉన్నారు.
బ్రూక్ వ్యాఖ్యలు వైరల్:
అయితే నాలుగవ రోజు ఆటలో ఇంగ్లాండ్ ఆటగాడు బ్రూక్ తో గిల్ చేసిన సరదా సంభాషణ స్టంప్ మైక్ లో రికార్డు అయ్యింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుకున్న మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. రెండవ ఇన్నింగ్స్ లో భారత్ భారీ ఆదిఖ్యాన్ని సంపాదించుకుంటున్న సమయంలో బ్రూక్ తన చురుకైన మాటలతో కవ్వించే ప్రయత్నం చేశాడు. బ్రూక్ మాట్లాడుతూ.. “450 డిక్లేర్ చేస్తారా..? గిల్ రేపు వర్షం పడుతుంది. మధ్యాహ్నం వర్షం ఉంది. మాకు దురదృష్టం” అని అన్నాడు. దీంతో గిల్ కూడా నవ్వుతూ.. ” మాకు దురదృష్టమే” అని సమాధానం ఇచ్చాడు.
Also Read: Sanju Samson: సంజూ శాంసన్ పై కాసుల వర్షం.. KCL లో 26.80 లక్షలు.. ఇక మనోడి పంట పడినట్లే..
ఆ తర్వాత బ్రూక్.. ” డ్రా చేసుకోండి” అని నవ్వాడు. అయితే ఇది మాత్రమే కాకుండా 4వ రోజు ఆట ప్రారంభానికి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ లో బ్రూక్ మాట్లాడుతూ.. ” ప్రపంచం మొత్తానికి తెలుసు. ఎంతటి భారీ లక్ష్యాన్నైనా ఇంగ్లాండ్ చేదిస్తుందని” అని అన్నాడు. అంటే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలుపొందుతుందని చెప్పకనే చెప్పాడు. ఇక ఈ రెండవ టెస్ట్ కి నేడు చివరి రోజు. ఇంగ్లాండ్ మరో ఏడు వికెట్లను కోల్పోతే భారత్ విజయం సాధిస్తుంది. లేదంటే మ్యాచ్ డ్రా అవుతుంది.