Shubman Gill: భారత క్రికెట్ జట్టు నూతన కెప్టెన్ శుభ్ మన్ గిల్ తన కెరీర్ లోనే అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఇంగ్లాండ్ గడ్డమీద వరుస సెంచరీలతో దుమ్ము లేపుతున్నాడు. ఇంగ్లాండ్ తో లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో భారీ శతకం {147} బాదిన గిల్.. ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలోనూ సెంచరీలు బాది అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
రెండవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 387 బంతులు ఎదుర్కొన్న గిల్.. 34 ఫోర్లు, 3 సిక్సుల సహాయంతో 269 పరుగులు చేశాడు. అయితే తన కెరీర్ లో సాధించిన తొలి ద్విశతకాన్ని ట్రిపుల్ సెంచరీగా మార్చడంలో విఫలమయ్యాడు. జోష్ టంగ్ బౌలింగ్ లో ఓలీ పోప్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరడంతో.. అతడి భారీ ఇన్నింగ్స్ కి తెరపడింది. ఇక రెండవ టెస్ట్ లోని నాలుగవ రోజు ఆటలో భాగంగా గిల్ మరోసారి తన బ్యాట్ ని ఝలిపించాడు.
57 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కెప్టెన్ గిల్.. 129 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 100 పరుగుల మార్క్ అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన భారత కెప్టెన్ లలో సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీల తర్వాత మూడో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన తొలి రెండు టెస్టుల్లోనే మూడు సెంచరీలు నమోదు చేసిన రెండవ ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ, రెండవ ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన ఆటగాళ్ల క్లబ్ లో గిల్ కూడా స్థానం సంపాదించాడు.
వివాదంలో గిల్
అయితే తాజాగా గిల్ వివాదంలో చిక్కుకున్నాడు. ఇంగ్లాండ్ ముందు 608 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన సమయంలో గిల్ డిక్లేర్ ప్రకటించాడు. అయితే ఆ సమయంలో గిల్ వేసుకున్న టీ షర్ట్ ఇప్పుడు వివాదానికి కారణమైంది. 2023 మే నెలలో టీమ్ ఇండియా కొత్త కిట్ స్పాన్సర్ గా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ బ్రాండ్ “అడిడాస్” తో బిసిసిఐ ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటివరకు బైజూస్ సంస్థ భారత జట్టుకు స్పాన్సర్ చేసింది.
Also Read: IPL Players: ఐపీఎల్ ప్లేయర్లకు కొత్త వ్యాధి వచ్చిందా… ఇలా బక్కగా అయిపోయారు ఏంటి?
2023 మే నుండి ఆ స్థానంలో అడిడాస్ కిట్స్ ని అందిస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం 2028 వరకు అడిడాస్ భారత క్రికెట్ జట్టుకు కిట్ స్పాన్సర్ గా వ్యవహరించనుంది. అంటే భారత క్రికెట్ జట్టుకు సంబంధించిన అన్ని ఫార్మాట్ల ఆటలకు కిట్ లను తయారు చేస్తుంది. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు అంతా అడిడాస్ కి సంబంధించిన వాటినే వాడాల్సి ఉంటుంది. కానీ తాజాగా గిల్ “నైక్” టీ షర్ట్ ధరించి కనిపించడంతో ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకున్నాడు.