BigTV English

KKR – Rahane: కొత్త కెప్టెన్ ను ప్రకటించిన కోల్ కతా…. టెస్ట్ ప్లేయరే దిక్కు అయ్యాడు?

KKR – Rahane: కొత్త కెప్టెన్ ను ప్రకటించిన కోల్ కతా…. టెస్ట్ ప్లేయరే దిక్కు అయ్యాడు?

KKR – Rahane: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} లో ప్రముఖ ప్రాంచేజి కలకత్తా నైట్ రైడర్స్ కొత్త కెప్టెన్ నియామకం ఖరారైంది. మరో 18 రోజులలో ఐపీఎల్ 18వ ఎడిషన్ టోర్నీ ప్రారంభం కాబోతోంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముగిసిన రెండు వారాలలోనే క్రికెట్ అభిమానులను సందడి చేసేందుకు ఐపీఎల్ సిద్దం అవుతుంది. అయితే ఈ సీజన్ కి కొత్త జెర్సీతో సిద్ధమవుతున్న డిపెండింగ్ ఛాంపియన్ కలకత్తా నైట్ రైడర్స్ తాజాగా తన సారథిని ప్రకటించింది.


 

సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే కి జట్టు బాధ్యతలను అప్పగించింది. మెగా వేలంలో రహనేని 1.75 కోట్ల ఆరంభ ధరతో కలకత్తా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక మెగా వేలంలో 23.75 కోట్ల కళ్ళు చెదిరే మొత్తంతో ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ని కలకత్తా దక్కించుకోవడంతో.. కెప్టెన్సీ బాధ్యతలను అతడికే అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా రహానే ని కెప్టెన్ గా నియమించి.. వైస్ కెప్టెన్ గా వెంకటేష్ అయ్యర్ కి బాధ్యతలను అప్పగించింది కలకత్తా మేనేజ్మెంట్. ఈ మేరకు ఫ్రాంచైజీ సోమవారం తమ అధికారిక ఎక్స్ {ట్విటర్} ఖాతాలో ప్రకటించింది.


2024 ఐపిఎల్ టైటిల్ ని అందించిన శ్రేయస్ అయ్యర్ ని మేనేజ్మెంట్ ఈసారి రిటైన్ చేసుకోలేదు. అనూహ్యంగా వెటరన్ ఆటగాడు అజింక్య రెహనేని తీసుకుంది. తొలిరోజే ఐపిఎల్ మెగా వేలంలోకి వచ్చిన రహానే ను దక్కించుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. కానీ రెండవ రోజు వేదంలో ఆఖరి రౌండ్ లో 1.75 కోట్లకు కలకత్తా కైవసం చేసుకుంది. ఇక ఈ జట్టులో సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ వంటి ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు.

వీరిద్దరూ కెప్టెన్సీ రేసులో ఉన్నప్పటికీ.. కలకత్తా మాత్రం రహానే వైపు మొగ్గు చూపింది. వెంకటేష్ అయ్యర్ కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తారని అంతా భావించారు. కానీ అతడికి అనుభవం లేనందున రహానే కి అప్పగించారు. ఇక కలకత్తా తమ కొత్త సారథిని ప్రకటించడంతో.. ఢిల్లీ క్యాపిటల్స్ మినహా అన్ని జట్లకు కెప్టెన్ ఎవరనేది తేలిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం కేఎల్ రాహుల్ లేదా అక్షర్ పటేల్ లో ఒకరిని కెప్టెన్ గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక కలకత్తా కొత్త కెప్టెన్ ని మాత్రమే కాకుండా నేడు కొత్త జెర్సీ ని కూడా ఆవిష్కరించింది. ఈ జెర్సీపై మూడు స్టార్లకు చోటు కల్పించింది. కలకత్తా ఇప్పటివరకు మూడు టైటిల్లను సొంతం చేసుకోవడంతో మూడు స్టార్లకు చోటు కల్పించింది. KKR IPL 2025 జట్టు: రింకు సింగ్, వరుణ్ చకరవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, రమణదీప్ సింగ్,

 

వెంకటేష్ అయ్యర్ (రూ. 23.75 కోట్లు), క్వింటన్ డి కాక్ (రూ. 3.60 కోట్లు), రహ్మానుల్లా గుర్బాజ్ (రూ. 200 కోట్లు), రహ్మానుల్లా గుర్బాజ్ (రూ. 5 కోట్లు. కోటి), అంగ్‌క్రిష్ రఘువంశీ (రూ. 3 కోట్లు), వైభవ్ అరోరా (రూ. 1.80 కోట్లు), మయాంక్ మార్కండే (రూ. 30 లక్షలు), రోవ్‌మన్ పావెల్ (రూ. 1.50 కోట్లు), మనీష్ పాండే (రూ. 75 లక్షలు), స్పెన్సర్ జాన్సన్ (రూ. 2.80 కోట్లు), ఎ. 30 లక్షల రూపాయలు. రహానె (రూ. 1.50 లక్షలు), అనుకుల్ రాయ్ (రూ. 40 లక్షలు), మొయిన్ అలీ (రూ. 2 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ. 75 లక్షలు).

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×