Actress Abhirami: ప్రస్తుతం భారత సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది కమలహాసన్ మూవీ థగ్ లైఫ్. లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలోఈ మూవీ రూపొందింది. ఈ చిత్రం ఓ గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతుంది. శింబు,త్రిష,అభిరామి,ఐశ్వర్య లక్ష్మి,నాజర్,తనికెళ్ల భరణి కీలక పాత్రలో నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు మూవీ టీం. ఇక తాజాగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో భాగంగా ఈ చిత్రంలో నటిస్తున్నఅభిరామి, మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నిప్రేక్షకులతో పంచుకున్నారు. ఆ వివరాలు చూద్దాం..
నాకల నెరవేరింది..అభిరామి ..
తెలుగులో అభిరామి హీరోయిన్ గా పలు సినిమాలలో నటించారు. మలయాళ సినిమాలతోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోనూ ఈమె చేసిన సినిమాలు తక్కువే అయినా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.ఈమె తెలుగులో చేసిన చెప్పవే చిరుగాలి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నటిగా అభిరామికి మంచి ప్రశంసలను తెచ్చిపెట్టింది. ఇక నాలుగు పదుల వయసు దాటిన అభిరామి వరుస సినిమాలతో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఇక తాజాగా కమలహాసన్ హీరోగా నటిస్తున్న చిత్రంలో అభిరామి నటిస్తోంది. తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో, అభిరామి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం ఓ మంచి సినిమా తెలుగులో వస్తే ఇక్కడ ఆడియన్స్ ఎలా సపోర్ట్ చేస్తారనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.మీ సపోర్ట్ వేరే లెవెల్ లో ఉంటుంది. ప్రత్యేకంగా మీ ప్రేమకి నేను కృతజ్ఞతలు చెప్పాలి.ఈ సినిమా నాకు డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది. మణిరత్నం గారు, కమలహాసన్ గారు, ఏ ఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ లో శింబు లాంటి లెజెండ్రీస్ తో వర్క్ చేయడం నాకు నిజంగా ఓ డ్రీమ్. అలాంటి నా కల ఈ సినిమాతో నెరవేర్చుకున్నాను. ఈ సినిమా తరువాత ఒక యాక్టింగ్ స్కూల్ కి వెళ్లి వచ్చిన అనుభవం నాకు కలుగుతుంది. మీరందరూ ఈ సినిమాని తప్పకుండా థియేటర్లో చూడండి. జూన్ 5న థియేటర్లలో రానున్న ఈ సినిమా కోసం మీతో పాటు నేను ఎదురు చూస్తున్నాను. అని ఆమె తెలిపింది.
ఆ మూవీ లో క్యారెక్టర్ పేరు..ఇదే ..
ఇక సుమ అభిరామితో మీరు కమల్ హాసన్ నటించిన ‘గుణ’ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ పేరు మీ పేరుగా పెట్టుకున్నట్లు మాకు ఈ మధ్యనే తెలిసింది. అది నిజమేనా, మీకు ఎంతో ఇష్టమైన గుణ సినిమాలో మీకు నచ్చిన పాటని పాడండి అని అడగ్గా.. అభిరామి.. కమ్మని ఈ ప్రేమలేఖలే అనే పాటను తమిళంలో పాడి ప్రేక్షకులను ఉత్సాహపరుస్తుంది. ఈ వీడియో చూసిన వారందరికీ అభిరామికి కమలహాసన్ మీద ఎంత అభిమానముందో తెలిసిపోతుంది. ఆమె అసలు పేరు దివ్య గోపికుమార్ ఆమె తన పేరుని కమలహాసన్ గుణ సినిమా హీరోయిన్ రోషిణి క్యారెక్టర్ పేరు పెట్టుకున్నారంటే, ఆమె అభిమానం వేరే లెవెల్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఈ మూవీ జూన్ 5 న రిలీజ్ కానుంది.