E-Paper
Advertisement

Alcaraz : వింబుల్డన్‌ విజేత అల్కరాజ్.. జకోవిచ్ కు షాక్..

Alcaraz : వింబుల్డన్‌ విజేత అల్కరాజ్.. జకోవిచ్ కు షాక్..
Advertisement

Alcaraz : వింబుల్డన్‌ టైటిల్ ను యువ సంచలనం అల్కరాజ్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్ టెన్నిస్ దిగ్గజం జకోవిచ్‌ కు షాకిచ్చాడు.ఎంతో హోరాహోరీగా సాగిన తుదిపోరులో‌ స్పెయిన్‌ ఆటగాడు అల్కరాజ్ 1-6, 7-6 (8-6), 6-1, 3-6, 6-4తో ‌ జకోవిచ్‌ ను ఓడించాడు. 4 గంటల 42 నిమిషాల పాటు ఈ మ్యాచ్ సాగింది. తొలి సెట్‌ ఓడినా అద్భుతంగా అల్కరాజ్ పుంజుకున్నాడు.

తొలి సెట్ లో ఒక్క గేమ్‌ మాత్రమే కోల్పోయి జకోవిచ్ గెలిచాడు.‌ రెండో సెట్‌ నుంచి మ్యాచ్‌ ఒక్కసారిగా టర్న్ తీసుకుంది. అల్కరాజ్ పుంజుకున్నాడు. ఈ సెట్ లో స్కోరు 6-6తో సమకావడంతో టైబ్రేకర్‌ కు వెళ్లింది. ఇందులో 7-6తో నిలిచిన అల్కరాజ్ సెట్ ను‌ గెలుచుకున్నాడు. ఇదే ఊపులో మూడో సెట్లోనూ అల్కరాజ్ దూకుడు ప్రదర్శించాడు. తొలి సెట్‌ ఓడినా ఆ తర్వాత వరుసగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్ పై పట్టుసాధించాడు. నాలుగో సెట్ లో జకోవిచ్ తన అనుభవాన్ని ఉపయోగించాడు. అల్కరాజ్ జోరుకు కళ్లెం వేశాడు. దీంతో నాలుగో సెట్‌ ను జకో గెలిచాడు.

Advertisement

దీంతో మ్యాచ్‌ను మరింత ఉత్కంఠగా మారింది. ఐదో సెట్ ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ ఏర్పడింది. హోరాహోరీగా సాగిన ఐదో సెట్ లోనూ అల్కరాజ్ అదే జోరును కొనసాగించిన ఛాంపియన్‌ గా నిలిచాడు.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

ఎయిర్‌టెల్ 5G యూజర్లకు అలర్ట్.. హాట్‌స్పాట్ ఆన్ చేస్తే డేటా కట్ అంటూ ప్రచారం..!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×