BigTV English

Rains : తెలంగాణలో 4రోజులపాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ..

Rains : తెలంగాణలో 4రోజులపాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ..

Rains : బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఆవర్తనం ఏర్పడింది. దీంతో ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌, ఝార్ఖండ్‌పై అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ ప్రకటించింది. ఈ అల్పపీడనం మంగళవారం నాటికి దక్షిణ దిశగా కదిలే సూచనలున్నాయని పేర్కొంది. మరోవైపు బంగాళాఖాతంలో ఈ నెల 18న మరో ఆవర్తనం ఏర్పడే అవకాశముందని తెలిపింది. పశ్చిమ దిశ నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది.


తెలంగాణలో 4 రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌ , జయశంకర్‌ భూపాలపల్లి, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

బుధవారం నుంచి గురువారం వరకు రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.


Related News

Gautami Chowdary: గౌతమ్‌ చౌదరికి అంబర్‌పెట్‌ శంకర్‌ మద్దతు.. లైవ్‌లో అసలు నిజం బట్టబయలు..

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Big Stories

×