Australian Open 2025: ఆస్ట్రేలియా ఓపెన్ 2025 బరిలోకి దిగిన సెర్బియా టెన్నిస్ స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ ని దురదృష్టం వెంటాడింది. అసాధారణ ప్రదర్శనతో సెమీఫైనల్ కి చేరిన ఈ సెర్బియా స్టార్ ఆటగాడు అనూహ్య రీతిలో ఈ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తన కెరీర్ లో 25వ గ్రాండ్ స్లామ్ ను దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న జకోవిచ్ గాయంతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు.
Also Read: Indian Players: టీమిండియాలో కల్లోలం.. ఒకేసారి విడాకులు తీసుకోనున్న ముగ్గురు ప్లేయర్లు ?
ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఓపెన్ 2025 సెమీస్ లో జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వరెవ్ పై మ్యాచ్ లో బరిలోకి దిగి తొలి సెట్ తర్వాత రిటైర్డ్ హార్ట్ ప్రకటించి బయటకు వెళ్లిపోయాడు. గాయం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ఈ నిర్ణయంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. గాయం కారణంగా అతడు ఆట మధ్యలోనే వైదొలగడంతో జ్వారెవ్ విజేతగా నిలిచి ఫైనల్ కీ అర్హత సాధించాడు. జకోవిచ్ 6 – 7 (5/7) తో తొలి సెట్ ని కోల్పోయాడు.
దీంతో అతడిని ప్రేక్షకులు ఎగతాళి చేశారు. ఆ తర్వాత హోరా హోరీగా సాగిన తొలి సెట్ టై బ్రేక్ కు దారి తీయగా.. అలెగ్జాండర్ పై చేయి సాధించాడు. అయితే క్వాటర్ ఫైనల్ లోనే జకోవిచ్ గాయపడ్డాడు. అయినప్పటికీ సెమీఫైనల్ లో బరిలోకి దిగి పోరాడాడు. కానీ గాయం తీవ్రత ఎక్కువ ఐన కారణంగా ఆట మధ్యలోనే వైదొలిగాడు. ఇక నేడు జరగనున్న రెండవ సెమీస్ లో విజేతగా నిలిచే ఆటగాడితో ఫైనల్ కీ చేరిన జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వారెవ్ టైటిల్ కోసం పోరాడతాడు.
నేడు జరిగే రెండవ సెమీస్ లో ఇటలీకి చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ సినర్ తో.. అమెరికా సంచలనం బెన్ షెల్టన్ మరో సెమిస్ లో తలపడనున్నారు. ఇక ఆదివారం రోజు ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈరోజు జరిగిన మ్యాచ్ అనంతరం అలెగ్జాండర్ జ్వారెవ్ మాట్లాడుతూ.. గాయంతో తప్పుకున్న జకోవిచ్ ని ఎగతాళి చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు.
Also Read: Rajkumar Rao: గంగూలీ బయోపిక్ వచ్చేస్తోంది.. హీరో ఎవరంటే ?
ప్రతి ఒక్కరూ టికెట్లు కొనుక్కొని మ్యాచ్ చూసేందుకు వచ్చారని తనకు తెలుసని అన్నాడు. “అందరూ ఐదు సెట్ల మ్యాచ్ చూడాలని ఆశపడ్డారు. కానీ జకోవిచ్ పొత్తికడుపు, తొడ కండరాల గాయంతో బాధపడుతూ ఈ టోర్నీలో విజయాలు సాధించాడు. కానీ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో తప్పుకున్నాడు. కాబట్టి అతనికి కనీస గౌరవం ఇవ్వండి” అని కోరాడు. కాగా ఆస్ట్రేలియా ఓపెన్ లో అలెగ్జాండర్ జ్వారెవ్ ఫైనల్ చేరడం ఇదే మొదటిసారి.
Not how we wanted your campaign to end, @djokernole.
Thank you for another wonderful Australian summer. Well played and best wishes for a speedy recovery.#AO2025 pic.twitter.com/d5VJ6YNBeN
— #AusOpen (@AustralianOpen) January 24, 2025