Rajkumar Rao: గత కొన్ని సంవత్సరాలుగా వెండితెరపై బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. పలువురు ప్రముఖులు, రాజకీయ నేతల బయోపిక్స్ మాత్రమే కాకుండా.. క్రీడాకారుల జీవితాల ఆధారంగా తెరకెక్కిన బయోపిక్స్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టాయి. మహేంద్ర సింగ్ ధోని, మిల్కా సింగ్, మేరీకామ్ వంటి క్రీడాకారుల బయోపిక్స్ బాక్సాఫీస్ వద్ద ఎంతటి కలెక్షన్లు రాబట్టాయో మనందరికీ తెలిసిందే.
Also Read: Rinku Singh: అదృష్టం అంటే ఇదే… రూ.500 కోట్ల ఆస్తులకు రింకూ అధిపతి ?
అయితే త్వరలో ఓ దిగ్గజ క్రికెటర్ బయోపిక్ కూడా వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. ఆయన ఎవరో కాదు టీమిండియా మాజీ కెప్టెన్, అభిమానులంతా ముద్దుగా “దాదా” అని పిలుచుకునే సౌరబ్ గంగూలీ బయోపిక్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. హిందీలో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ కొత్త అప్డేట్ వచ్చింది. తొలుత ఈ బయోపిక్ లో ఆయుష్మాన్ ఖురానా లీడ్ రోల్ చేస్తాడని వార్తలు వినిపించాయి. అయితే కొన్ని కారణాలవల్ల అతడు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు.
అనంతరం ఈ పాత్ర కోసం మరో నటుడిని వెతికే పనిలో పడింది నిర్మాణ సంస్థ. అయితే తాజాగా గంగూలి బయోపిక్ లో రాజ్ కుమార్ రావు లీడ్ రోల్ పోషిస్తారని ప్రచారం జరుగుతుంది. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోత్వాని హిందీలో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. లవ్ రంజన్, అంకుర్ గార్గ్ { లవ్ ఫిలిమ్స్ } ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తోంది. దాదా బయోపిక్ ఈ ఏడాది చివరిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయిందని.. అయితే గంగూలీ హవా భావాలు, అతడు ఆడే విధానం, తదితర అంశాలపై రాజ్ కుమార్ రావు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ని మొదలుపెట్టి.. ఈ ఏడాది చివరలో విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. భారత క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్స్ లలో గంగూలీ ఒకరు.
Also Read: Yuzvendra Chahal: అర్థరాత్రి 12 గంటలకు ఆ మిస్టరీ లేడీతో చాహల్ వీడియో కాల్స్ !
గంగూలీ జట్టుకు దూకుడు నేర్పాడు. సచిన్ టెండూల్కర్ కి జతగా ఇన్నింగ్స్ ఆరంభించి ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ లు ఆడాడు. ఇంగ్లాండ్ గడ్డపై నాట్ వెస్ట్ ట్రోఫీ విజయం గంగూలి కెరీర్ లో మరపురానిది. గంగూలి కెప్టెన్సీలో భారత జట్టు 146 వన్డేలలో 76 విజయాలు నమోదు చేసింది. అలాగే 49 టెస్టులలో 21 మ్యాచ్ లలో భారత జట్టును విజయ తీరాలకు చేర్చాడు గంగూలీ. దాదా జీవితంలో కాంట్రవర్సీలకు కొదవలేదని చెప్పాలి. అలాంటి వ్యక్తి బయోపిక్ ని మోత్వాని ఎలా తెరకెక్కిస్తాడనేది ఇప్పుడు అందరిలో ఉత్కంఠ నెలకొంది.
🚨 RAJKUMAR RAO AS GANGULY. 🚨
– Rajkumar Rao likely to play Sourav Ganguly in Dada’s biopic. (Sumit Ghosh). pic.twitter.com/zReuoMSp4h
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 24, 2025