BigTV English

Virat Kohli Arrest: బెంగుళూరు తొక్కిసలాట.. విరాట్ కోహ్లీ అరెస్ట్.. అల్లు అర్జున్ లాగానే ?

Virat Kohli Arrest: బెంగుళూరు తొక్కిసలాట.. విరాట్ కోహ్లీ అరెస్ట్.. అల్లు అర్జున్ లాగానే ?

Virat Kohli Arrest: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట సంఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ సంఘటన జరగగానే 11 మంది అక్కడికక్కడే మృతి చెందిన నేపథ్యంలో… నెటిజెన్స్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వంతోపాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యంపై కూడా ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీని టార్గెట్ చేసి కొంత మంది… దారుణంగా పోస్టులు పెడుతున్నారు. ఒక్క టైటిల్ కోసం 11 మంది ప్రాణాలు తీస్తారా అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు క్రికెట్ అభిమానులు అలాగే నెటిజన్స్.


ALSO READ: RCB Maiden IPL Trophy: 18 ఏళ్ల నిరీక్షణ… ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా RCB… ప్రైజ్ మనీ ఎంతంటే

విరాట్ కోహ్లీ అరెస్ట్?


బెంగళూరు చిన్న స్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిన నేపథ్యంలో… ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని అరెస్టు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా విరాట్ కోహ్లీని అరెస్టు చేయాలని పోస్టులు కూడా పెడుతున్నారు. విరాట్ కోహ్లీ కారణంగానే బెంగళూరు చిన్న స్వామి స్టేడియం దగ్గర అంత స్థాయిలో క్రౌడ్ వచ్చిందని.. అతని వల్ల 11 మంది మృతి చెందారని.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనాలు. ఈ సంఘటనకు పూర్తి బాధ్యత విరాట్ కోహ్లీనే వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వెంటనే విరాట్ కోహ్లీని అరెస్టు చేసి జైలుకు పంపాలని కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కొంతమంది.

అల్లు అర్జున్ తరహాలో అరెస్టు చేయాల్సిందే ?

గత డిసెంబర్ మాసంలో… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. పుష్ప రెండవ పార్టు సినిమా సందర్భంగా… అల్లు అర్జున్ భారీ ర్యాలీతో… సంధ్య థియేటర్ కు రావడం కారణంగా రేవతి అనే మహిళ మృతి చెందింది. అలాగే… రేవతి కొడుకు ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నాడు. ఇలాంటి నేపథ్యంలో… రేవంత్ రెడ్డి సర్కార్.. సెలబ్రిటీ అని చూడకుండా వెంటనే అల్లు అర్జున్ ను అరెస్టు చేసింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చాలా మెచ్చుకున్నారు. దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి పాలనపై ప్రశంసలు కురిసాయి. అయితే ఇప్పుడు కూడా అదే తరహాలో చాలామంది చనిపోయారని.. అందుకు విరాట్ కోహ్లీని అరెస్టు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి తరహాలో దమ్మున్న నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర సరిగ్గా నాలుగున్నర గంటల సమయంలో తొక్కిసలాట జరిగి…. 11 మంది మృతి చెందినట్లు చెబుతున్నారు. అలాగే 33 మంది ఆసుపత్రి పాలయ్యారని వెల్లడిస్తున్నారు. అదే సమయంలో పదిమంది ఐసీఈలో చికిత్స పొందుతున్నారు. అయితే సంఘటన నాలుగున్నర గంటలకు జరిగితే 6:30 గంటలకు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సభ్యులంతా ఎంజాయ్ మూడ్ లో ఉన్నారని.. వాళ్లకు అసలు జనాలంటే పట్టించే లేదని ఫైర్ అవుతున్నారు. అందుకే ఇలాంటి వాళ్లను అరెస్టు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ALSO READ: Anushka Sharma-Virat Kohli: 18 ఏళ్ళ తర్వాత కప్.. అనుష్కకు టైట్ హాగ్ ఇచ్చి.. ఏడ్చేసిన కోహ్లీ

Related News

India vs Pakistan Final: ఇండియాను వ‌ద‌ల‌కండి…చంపేయండి అంటూ రెచ్చిపోయిన పాక్ ఫ్యాన్‌..హరీస్ రవూఫ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి !

Asia Cup 2025 : పాక్ చెత్త ఫీల్డింగ్.. మ‌రోసారి రుజువైంది..చేతులారా వ‌చ్చిన రనౌట్ వ‌దిలేశారుగా

India vs Pakistan final: టీమిండియా, పాక్ మ‌ధ్య ఫైన‌ల్స్‌… 41 ఏళ్లలో తొలిసారి…రికార్డులు ఇవే..ఫ్రీగా చూడాలంటే?

IND vs SL: నేడు శ్రీలంక‌తో మ్యాచ్‌…టీమిండియాకు మంచి ప్రాక్టీస్…బ‌లాబ‌లాలు ఇవే

Rohith Sharma : మ‌రోసారి 10 కిలోలు తగ్గిన రోహిత్ శ‌ర్మ‌…ఇక ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లే

Asia Cup 2025 : బంగ్లా చిత్తు… ఫైనల్ కు పాకిస్తాన్.. టీమిండియాతో బిగ్ ఫైట్

PAK Vs BAN : పాకిస్తాన్ కి షాక్.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs BAN : ఇండియానా… అదెక్కడుంది? బంగ్లాదేశ్ అభిమాని ఓవరాక్షన్

Big Stories

×