BigTV English

Ambati Rayudu:-  ఏంటి.. మన అంబటి రాయుడు రాజకీయాల్లోకా,,? చేర్చుకోడానికి రెడీగా బీఆర్ఎస్

Ambati Rayudu:-  ఏంటి.. మన అంబటి రాయుడు రాజకీయాల్లోకా,,? చేర్చుకోడానికి రెడీగా బీఆర్ఎస్

Ambati Rayudu:- ఐపీఎల్‌లో సత్తాచాటుతున్న మన గుంటూరోడు అంబటి రాయుడు. ప్రస్తుతం చెన్నై జట్టు తరపున ఆడుతున్న అంబటి రాయుడికి మంచి రికార్డ్సే ఉన్నాయి. 2018 సీజన్‌లో అయితే ఏకంగా 602 పరుగులు చేశాడు. మొత్తం ఐపీఎల్ కెరీర్‌లో ఒక సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు చేశాడు. గత పది ఐపీఎల్ మ్యాచ్‌లలో పెద్దగా పర్ఫామ్ చేయకపోయినా.. చెన్నై జట్టు మాత్రం అవకాశాలు ఇస్తూనే ఉంది.


ఇండియన్ క్రికెట్ టీమ్‌లోకి అంబటి రాయుడు మళ్లీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కుర్ర టాలెంట్ సత్తా చాటుతుండడంతో.. ఐపీఎల్‌కే పరిమితం కావొచ్చు. అందులోనూ.. మరో రెండు సీజన్లకు మించి ఐపీఎల్‌లో కూడా ఉండకపోవచ్చు. సో, వాట్ నెక్ట్స్. ఆ తరువాత అంబటి రాయుడు ఏం చేస్తాడు. కామెంటేటర్‌గా చేస్తాడా? ఈ మధ్య సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ఏంటంటే.. అంబటి రాయుడు పాలిటిక్స్‌లోకి వస్తాడని.

పార్టీని బీఆర్ఎస్‌గా మార్చిన తరువాత కర్నాటక, మహారాష్ట్రపై ఫోకస్ పెట్టిన కేసీఆర్.. ఏపీ పాలిటిక్స్ పైనా అంతే సీరియస్‌గా ఉన్నారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ పేరుతో విశాఖలో ఎంటర్ అయ్యారు. నెక్ట్స్ టార్గెట్ గుంటూరే. సినీ ఆర్టిస్టులు, క్రికెటర్స్‌ను పార్టీలోకి తీసుకోవడం పార్టీలకు అలవాటే. అదే దారిలో వెళ్తున్నారు సీఎం కేసీఆర్. అంబటి రాయుడును బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకురావాలనుకుంటున్నారు.


నిజానికి అంబటి రాయుడే.. పాలిటిక్స్‌పై ఇంట్రస్ట్ చూపించాడు. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి రావడమే కరెక్ట్ రూట్ అని చెప్పాడు. మరికొందరిని కలిసిన తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకుంటానన్నాడు. అంబటి రాయుడు అనే అన్నాడో లేదో.. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌‌‌‌.. అంబటిని తమ పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పైగా సిద్దిపేటలో రాయుడికి వ్యవసాయ భూములు ఉన్నాయి. హరీశ్ రావు, కేటీఆర్‌‌‌‌తో మంచి పరిచయాలు కూడా ఉన్నాయ్. పైగా కాపు సామాజికవర్గం కావడంతో.. పార్టీకి కలిసి వస్తుందని భావిస్తున్నారు. బహుశా… గుంటూరు అసెంబ్లీ నుంచి బరిలోకి దింపుతారని చెప్పుకుంటున్నా.. సీఎం కేసీఆర్ ఫోకస్ ఎంపీ సీట్లే. సో, ఎంపీ అభ్యర్థిగానే బరిలో దింపొచ్చని మాట్లాడుకుంటున్నారు. 

Related News

IND Vs SL : ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ లో సూపర్ ఓవర్… ఎవరు గెలిచారంటే

Asia Cup 2025 : ఆసియా కప్ ఫైనల్స్ కు ముందు షాక్…సూర్య, రవూఫ్‌కు 30% ఫైన్

IND Vs SL : 300కు పైగా పరుగులు.. అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు.. శ్రీలంక టార్గెట్ ఎంత అంటే ?

Abhishek- Gambhir: అభిషేక్ శ‌ర్మ‌ను బండ‌బూతులు తిట్టిన గంభీర్‌..ఈ దెబ్బ‌కు ఉరేసుకోవాల్సిందే !

IND Vs SL : టాస్ గెలిచిన శ్రీలంక‌.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : ఇండియా వర్సెస్ పాక్ ఫైనల్..PVR సంచలన నిర్ణయం.. ఏకంగా 100 థియేటర్స్ లో

Asia Cup 2025 : ఒకే గొడుగు కిందికి పాకిస్తాన్, బంగ్లా ప్లేయర్స్… ఇద్దరు ఇండియాకు శత్రువులే.. క్రేజీ వీడియో వైరల్

Shoaib Akhtar : ఇండియాకు ఇగో ఎక్కువ‌.. ఆదివారం మొత్తం దించేస్తాం..ఇక కాస్కోండి !

Big Stories

×