Ambati Rayudu: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటు ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ( Royal Challengers Bangalore vs Chennai Super Kings) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను దారుణంగా ఓడించింది బెంగళూరు. 43 పరుగుల తేడాతో బెంగళూరు చేతిలో ఓడిపోయింది చెన్నై. అయితే ఈ ఓటమి నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు బెంగళూరు ఫ్యాన్స్. అయితే ఈ ట్రోలింగ్ పైన తాజాగా అంబటి రాయుడు ( Ambati Rayudu) తన స్టైల్లో స్పందించారు. ఒక గెలుపుకే టైటిల్ గెలిచినంత ఓవరాక్షన్ చేయడం అవసరమా అని ఫైర్ అయ్యారు. తలకిందులుగా తపస్సు చేసినా, మహేంద్ర సింగ్ ధోని ( Dhoni ) రేంజ్ కు విరాట్ కోహ్లీ ( Kohli ) చేరుకోవడం కష్టమేనని బాంబు పేల్చారు అంబటి రాయుడు. అతనికంత సీన్ లేదని పరువు తీశారు. దీంతో అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనికి బెంగుళూరు అభిమానులు కూడా కౌంటర్లు పేల్చుతున్నారు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ నేపథ్యంలో RCB ఫ్యాన్స్ కాస్త ఓవర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అంబటి రాయుడు రంగంలోకి దిగాడు. విరాట్ కోహ్లీ పరువు తీస్తూ మాట్లాడారు. తలకిందులుగా తపస్సు చేసిన కూడా మహేంద్రసింగ్ ధోని అలాగే రోహిత్ శర్మ కాలిగోటికి విరాట్ కోహ్లీ సరిపోడని బాంబు పేల్చారు. ఈ ఇద్దరు క్రికెటర్లకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ విరాట్ కోహ్లీకి లేదని తెలిపారు. విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంత ఫేక్ అంటూ బాంబు పేల్చారు.
ఒక్క టైటిల్ గెలిచినందుకే విరాట్ కోహ్లీ టీం ఆగడం లేదని ఫైర్ అయ్యారు. మరి చెన్నై సూపర్ కింగ్స్ తరహాలో ఐదు టైటిల్స్ గెలవాలంటే మరో 72 సంవత్సరాలు కావాలి అంటూ చురకలు అంటించారు అంబటి రాయుడు. మహేంద్ర సింగ్ ధోని అలాగే రోహిత్ శర్మ ఇద్దరు కూడా మొత్తం ఐదు ఐసీసీ ట్రోఫీలను టీమిండియా కు అందించారని గుర్తు చేశారు. కానీ విరాట్ కోహ్లీ ఆధ్వర్యంలో ఎలాంటి ఐసిసి ట్రోఫీని టీమిండియా కు అందించలేదని ఫైర్ అయ్యారు. అలాంటి విరాట్ కోహ్లీ, ధోని, రోహిత్ శర్మ లకు ఏ మాత్రం సరిపోడాని పరువు తీశారు. గెలిస్తే ఇంతలా సంబరాలు చేసుకోవడం, ఓవరాక్షన్ అవసరం లేదని మండిపడ్డారు.