BigTV English

Rohit Sharma Row – Kohli: కోహ్లీ ఓ బ్రిటీష్ రాయబారి… షామా సంచలన వ్యాఖ్యలు!

Rohit Sharma Row – Kohli: కోహ్లీ ఓ బ్రిటీష్ రాయబారి… షామా సంచలన వ్యాఖ్యలు!

Rohit Sharma Row – Kohli: టీమిండియా కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ పై బాడీ షేమింగ్ పోస్ట్ తో కొత్త వివాదం లేవనెత్తిన కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ ప్రస్తుతం తీవ్రంగా విమర్శలకు గురవుతుంది. సామాన్య క్రికెట్ అభిమానుల నుండి రాజకీయ, టీమిండియా మాజీలు, ఆఖరికి సొంత పార్టీ నుండి కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. తాజాగా ఓ జాతీయ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..


 

” ఓ ఆటగాడు ఎప్పుడు ఫిట్ గా ఉండాలనేదే నా అభిప్రాయం. అందుకే రోహిత్ శర్మ విషయంలో అలా మాట్లాడాను. అతడు కాస్త ఓవర్ వెయిట్ అనిపించాడు. అందుకే అలా ట్వీట్ చేశాను. ఇందులో బాడీ షేమింగ్ ఏం లేదు. నేను తప్పు చేయలేదు. ఇది ప్రజాస్వామ్యం. ఇందులో తప్పేముంది. నాకు మాట్లాడే హక్కు ఉంది” అని వ్యాఖ్యానించింది. ఐతే రోహిత్ శర్మ పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలకు గురవుతున్న షామా మహమ్మద్ కి సంబంధించి.. గతంలో ఆమె స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.


ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీంతో షామా మహమ్మద్ పై క్రీడాభిమానులు మరింతగా రెచ్చిపోతున్నారు. 2018లో విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్ గా ఉన్న సమయంలో.. ఓ ఫ్యాన్ చేసిన పోస్ట్ కు తీవ్రంగా స్పందించాడు విరాట్ కోహ్లీ. అతడు భారత క్రికెట్ ని ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తో పోలుస్తూ కామెంట్స్ చేశాడు. ” నేను టీమిండియా ప్లేయర్స్ కన్నా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆడే క్రికెట్ ని ఎక్కువగా ఆస్వాదిస్తాను. విరాట్ కోహ్లీని అనవసరంగా పెద్ద బ్యాటర్ గా అభిమానిస్తుంటారు” అని ట్విట్ చేశాడు.

దీనిపై స్పందించిన విరాట్ కోహ్లీ.. ” నువ్వు భారత్ లో నివసించాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. భారత్ లో కాకుండా ఇంకెక్కడికైనా వెళ్లి నివసించు. ఇక్కడ ఎందుకు ఉంటున్నావు. భారతదేశంలో ఉంటూ ఇతర దేశాలపై అభిమానం చూపించడం ఏంటి. నీకు నేను నచ్చకపోవడం పై నాకైతే అభ్యంతరం లేదు” అని కోహ్లీ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. అయితే ఆ సమయంలో కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై షామా మొహమ్మద్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే..

” బ్రిటిష్ వాళ్లు కనిపెట్టిన ఆటని కోహ్లీ ఆడతాడు. అతడు ఫారిన్ బ్రాండ్లకి ప్రచారం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు. అతడు తన పెళ్లిని కూడా ఇటలీలోనే చేసుకున్నాడు. గిబ్స్ అతడి ఫేవరెట్ క్రికెటర్. ఏంజలిక్ కెర్బర్ అతని ఫేవరెట్ టెన్నిస్ ప్లేయర్. కానీ ప్రజలను ఇతర దేశాల ప్లేయర్లను అభిమానిస్తున్నామని చెబితే మాత్రం వారిని దేశాన్ని విడిచిపెట్టమని అంటాడు” అంటూ షామ కీలక వ్యాఖ్యలు చేసింది.

 

అయితే ఇప్పుడు రోహిత్ శర్మ పై ఆమె చేసిన కామెంట్ల నేపథ్యంలో.. గతంలో కోహ్లీపై చేసిన వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి. దీనిపై నెటిజెన్లు స్పందిస్తూ.. ఈమెకి ఇండియన్ ప్లేయర్స్ ఎవరూ నచ్చరేమోనని కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో షామా ని టార్గెట్ చేసిన రోహిత్ కోహ్లీ ఫ్యాన్స్.. ఈమెకి భారత క్రికెటర్లతో వచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదని ట్రోల్స్ చేస్తున్నారు. మరోవైపు తిరునమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌఘత్ రాయ్.. షామా మొహమ్మద్ వ్యాఖ్యలను సమర్ధించడంతో అతడి పై కూడా ట్రోల్స్ చేస్తున్నారు.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×