WhatsApp Account Security: ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ లలో వాట్సాప్ కూడా ఒకటి. ఈ యాప్ ద్వారా ప్రస్తుతం అనేక సమాచార మార్పిడి జరుగుతోంది. ఇలాంటి క్రమంలో మీ ఫోన్ వేరే వాళ్ల చేతుల్లోకి వెళితే అంతే సంగతులు. అది గోప్యత ఉల్లంఘనకు గురికావడంతోపాటు మీ డేటాను దుండగులు సేకరించే అవకాశం ఉంది.
గతంలో కూడా ఇలా సమాచార మార్పిడి జరిగి పలువురు నేరగాళ్లు కొంత మంది వ్యక్తిగత వివరాలు, వీడియోలను సేకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు దిగారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా మీ వాట్సాప్ ఖాతాను రహస్యంగా ఉపయోగిస్తున్నారో లేదా అనేది తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. దీని గురించి తెలుసుకోవడం ద్వారా మీరు మీ వాట్సాప్ వివరాలను మరింత భద్రంగా ఉంచుకోవచ్చు.
మీ ఫోన్ ఎవరికైనా దొరికితే ఈ యాప్ ద్వారా చేసే చాట్‌లు లేదా వీడియో, ఆడియో కాల్‌లు పూర్తిగా సేకరించుకునే ఛాన్స్ ఉందని వాట్సాప్ ఇప్పటికే తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కాకుండా మరెవరూ కూడా మీ వాట్సాప్ యాక్సెస్ చేయకుండా చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మీ వాట్సాప్ ఖాతా సమాచారాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు. దీంతోపాటు మీ డేటా దుర్వినియోగం కాకుండా కాపాడుకోవచ్చు.
Read Also: Portable Air Cooler: రూ. 500కే అదిరిపోయే పోర్టబుల్ కూలర్.. దీని స్పెషల్ ఏంటంటే..
ఇలాంటి క్రమంలో మీ వాట్సాప్ ఖాతాను వేరొకరు ఉపయోగిస్తున్నారో లేదో తనిఖీ చేయడానికి, మీరు ఎలాంటి థర్డ్ పార్టీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయవలసిన అవసరం లేదు. దీన్ని తనిఖీ చేసుకోవడం కూడా చాలా సులభం. దీని కోసం మీరు మీ ఫోన్‌లోని వాట్సాప్‌ను తాజాగా అప్‌డేట్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలనే విషయాలను ఇక్కడ చూద్దాం.