Chahal – Dhanushshree: టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. చాహల్ భార్య ధనశ్రీ వర్మ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ధనశ్రీ చాహల్ భార్యగా మాత్రమే కాకుండా డాన్సర్, కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ధనశ్రీ చిన్నప్పటి నుండే భరతనాట్యం నేర్చుకుంది.
Also Read: Sourav Ganguly Daughter: సౌరబ్ గంగూలీ కుమార్తెకు తృటిలో తప్పిన ప్రమాదం !
సొంతంగా డాన్స్ కంపెనీని కూడా స్థాపించింది. ఇక చాహల్ – ధనశ్రీ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ 2020 డిసెంబర్ 22 కరోనా సమయంలో వివాహం జరిగింది. కొంతకాలం పాటు బాగానే సాగిన వీరి దాంపత్య జీవితంలో కలహాలు వచ్చాయి. ధనశ్రీ వర్మ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ తో కలిసి డాన్స్ చేసిన వీడియోలు, ఆ తర్వాత కొన్ని పార్టీలకు వీరిద్దరూ కలిసి హాజరు కావడంతో వీరి మధ్య ఏదో ఉందని రూమర్లు వచ్చాయి. ఇక డిసెంబర్ 22న వీరి పెళ్లి రోజు.
ఆ రోజున వీరిద్దరూ విష్ చేసుకోలేదు. ఈ నేపథ్యంలో చాహల్ – ధనశ్రీ మధ్య మనస్పర్ధలు వచ్చాయని, ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఈ జంట ఖండించింది. ఆ తర్వాత గతేడాది డిసెంబర్ లో చాహల్ చేసిన ఓ పోస్ట్ మళ్ళీ వీరి విడాకుల ఊహాగానాలకు తెరలేపింది. ” ముగింపు మరో ప్రారంభానికి నాంది” అనే టైటిల్ తో శివుడి ఫోటోను షేర్ చేశాడు చాహల్.
ఈ పోస్ట్ చేసిన కొద్ది రోజులకే ఈసారి ఏకంగా తన భార్య ఫోటోలను తన అకౌంట్ నుండి తొలగించడంతో వీరి విడాకుల అంశం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉండే వీరిద్దరూ ఇంస్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో చర్చనీయాంశంగా మారింది. అలాగే ఈ జంట {Chahal – Dhanushshree} విడిపోవడానికి నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాలు కూడా వెల్లడించాయి. కానీ వీరు ఎందుకు విడిపోతున్నారు అన్న ఖచ్చితమైన కారణాలు మాత్రం చెప్పలేదు.
Also Read: Pant Fifty: పగబట్టినట్లుగా పంత్ విధ్వంసం.. కష్టాల్లో భారత్!
ఈ విడాకుల వార్తలపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక తన స్పిన్ మాయాజాలంతో ఎన్నో వికెట్లను కూల్చిన చాహల్ ఇటీవల భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. 2021 t20 వరల్డ్ కప్ కి ఎంపిక కాలేదు చాహల్. ఆ తర్వాత 2022లో కప్ కి ఎంపిక అయినప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆ తరువాత జట్టులో ప్లేస్ లేకుండా పోయింది. 2023 ఆగస్టులో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు చాహల్. ఐపీఎల్ 2025 మెగా వేలంలో చాహల్ ని పంజాబ్ కింగ్స్ 18 కోట్ల భారీ నగదుతో కొనుగోలు చేసింది. ఇక ధనశ్రీ వర్మ ప్రస్తుతం తెలుగులో “ఆకాశం దాటి వస్తావా” అనే సినిమాలో నటిస్తోంది.