Russell Nose Ring: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… మంగళవారం రోజున పంజాబ్ కింగ్స్ వర్సెస్ కేకేఆర్ జట్ల ( Kolkata Knight Riders vs Punjab Kings )మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చివరి క్షణంలో పంజాబ్ కింగ్స్ జట్టును విజయం వరించింది. అతి తక్కువ టార్గెట్ పెట్టినప్పటికీ… కేకేఆర్ ప్లేయర్లు దారుణంగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలోనే పంజాబ్ కింగ్స్ జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఇదంతా పక్కకు పెడితే… ఈ మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన జరిగింది.
Also Read: India vs Bangladesh 2025: బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన ఖరారు.. షెడ్యూల్ ఇదే.. కెప్టెన్ ఎవరంటే ?
ఆండ్రీ రస్సెల్ ( Andre Russell ) ముక్కుకు ఏంట్రా అది?
కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్ ( Andre Russell ) ముక్కుకు రింగు పెట్టుకున్నాడు. అచ్చం ఇండియాలోని మహిళలు ముక్కుకు ముక్కెర పెట్టుకున్నట్లుగానే…ఆండ్రీ రస్సెల్ కూడా తన ముక్కుకు ఓ రింగు ( Russell Nose Ring ) తగిలించుకున్నాడు. అంతకు ముందు తన చెవికి పోగు ఉంటుందన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ముక్కు కొత్తగా రింగ్ కూడా పెట్టేసుకున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆండ్రీ రస్సెల్ కు సంబంధించిన ముక్కు రింగు ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో.. ఆండ్రీ రస్సెల్ పై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. గేదెలకు ఏదో తగిలించినట్లుగానే… ఆండ్రీ రస్సెల్ ( Andre Russell ) ముక్కు కు రింగ్ ఉందంటూ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. మరి కొంతమంది పర్లేదు… ఆండ్రీ రస్సెల్ అంటేనే కొత్త ట్రెండు అంటున్నారు.
Also Read: Amaravati Cricket Stadium: అమరావతిలో 150 ఎకరాలలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం… 10 టి20 మ్యాచ్ లు !
కేకేఆర్ ను చిత్తు చేసిన పంజాబ్
కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Kolkata Knight Riders vs Punjab Kings ) జట్ల మధ్య జరిగిన ఇవాల్టి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ టీం గ్రాండ్ విక్టరీ కొట్టింది. అత్యల్ప స్కోర్ అయినప్పటికీ ఈ మ్యాచ్ మాత్రం ఉత్కంఠకు తెరలేపింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో ఆల్ అవుట్ అయింది. ఈ నేపథ్యంలోనే 111 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్. శ్రేయస్ అయ్యర్ నుంచి మొదలుకొని చిట్టచివరి వరకు అందరూ దారుణంగా విఫలమయ్యారు. దీంతో అత్యల్ప స్కోర్ చేసింది పంజాబ్ కింగ్స్. అయినప్పటికీ ఆ స్కోర్ ను కాపాడుకోగలిగింది పంజాబ్ కింగ్స్ టీం. అయితే 112 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో కేకేఆర్ జట్టు అత్యంత దారుణంగా విఫలమైంది. 15.1 ఓవర్లలోనే ఆల్ అవుట్ అయింది కేకేఆర్. దీంతో ఈ మ్యాచ్ లో 16 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ విజయం సాధించినప్పటికీ పంజాబ్ కింగ్స్ నాలుగవ స్థానంలో నిలవగలిగింది.