BigTV English

India vs Bangladesh 2025: బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన ఖరారు.. షెడ్యూల్‌ ఇదే.. కెప్టెన్ ఎవరంటే ?

India vs Bangladesh 2025: బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన ఖరారు.. షెడ్యూల్‌ ఇదే.. కెప్టెన్ ఎవరంటే ?

India vs Bangladesh 2025:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) కొనసాగుతున్న నేపథ్యంలో…. టీమిండియా ఆడబోయే కొత్త షెడ్యూల్ వచ్చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ పూర్తి కాగానే వరుసగా…. వన్డేలు, టి20 మ్యాచ్ లు, టెస్టులు ఆడనుంది టీం ఇండియా. ఇందులో భాగంగానే… బంగ్లాదేశ్ లో జరిగే… భారత జట్టు పర్యటన కు సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయింది. టీమిండియా సీనియర్స్ మెన్స్ జట్టు… ఇదే సంవత్సరం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లబోతోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ కాసేపటి క్రితమే ఖరారు అయింది.


Also Read: Amaravati Cricket Stadium: అమరావతిలో 150 ఎకరాలలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం… 10 టి20 మ్యాచ్ లు !

బంగ్లాదేశ్ లో భారత జట్టు పర్యటన షెడ్యూల్


బంగ్లాదేశ్ లో ( Bangladesh ) టీమిండియా జట్టు ( Team  Inida) పర్యటన షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) పూర్తికాగానే… అంటే ఆగస్టు నెలలో… బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా వెళ్తుంది. ఈ సందర్భంగా మూడు వన్డే మ్యాచ్లు ఆడనుంది. మూడు టి20 మ్యాచ్ లు… బంగ్లాదేశ్ జట్టుతో తలపడనుంది టీమిండియా. మిర్పూర్ వేదికగా… 17వ తేదీ అలాగే 20వ తేదీలలో తొలి రెండు వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. ఆగస్టు 23వ తేదీన చట్టొ గ్రామ్ లో మూడవ వన్డే జరగనుంది. అనంతరం మూడు టి20 ల సిరీస్ జరుగుతుంది. తొలి టి20 మ్యాచ్ ఆగస్టు 26వ తేదీన చట్టొ గ్రామ్ లో టీ మీడియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరగనుంది. మిగిలిన రెండు టి20 మ్యాచ్ లు ఆగస్టు 29వ తేదీ, 31వ తేదీలలో.. మిర్పూర్ వేదికగా జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ ఫైనల్ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి.

సెప్టెంబర్ లో టీమిండియా కు హాలిడేస్

బంగ్లాదేశ్ దేశంలో టీమిండియా పర్యటించిన తర్వాత… భారత ప్లేయర్లకు హాలిడేస్ ఉండనున్నాయి. సెప్టెంబర్ నెల మొత్తం టీమిండియా ఖాళీగా ఉంటుంది. ఇక అక్టోబర్ రెండవ తేదీ నుంచి వెస్టిండీస్ తో స్వదేశంలో రెండు మ్యాచ్లు టెస్ట్ సిరీస్ ఆడనుంది టీమిండియా. ఆ తర్వాత నవంబర్ నుంచి డిసెంబర్ మాసంలో దక్షిణాఫ్రికా తో రెండు టెస్టులు ఆడనుంది. అనంతరం మూడు వన్డే లతోపాటు ఐదు టి20 మ్యాచ్ లు జరుగుతాయి. బంగ్లాదేశ్‌లో భారత పర్యటనలో వన్డే మ్యాచ్ లకు రోహిత్ శర్మ కెప్టెన్ ఉండే ఛాన్స్ ఉంది. సూర్య కుమార్ యాదవ్ కు టీ20 కెప్టెన్సీ ఇస్తారు.

Also Read: Gavaskar-Kambli : గవాస్కర్ గొప్ప మనసు… నెలకు రూ. 30 వేలు ఇస్తున్నాడు !

బంగ్లాదేశ్‌లో భారత పర్యటన షెడ్యూల్
ODI సిరీస్:

1వ ODI – ఆగస్టు 17, మీర్పూర్
2వ ODI – ఆగస్టు 20, మీర్పూర్
3వ ODI – ఆగస్టు 23, ఛటోగ్రామ్

T20I సిరీస్:

1వ T20I – ఆగస్టు 26, ఛటోగ్రామ్
2వ T20I – ఆగస్టు 29, మీర్పూర్
3వ T20I – ఆగస్టు 31, మీర్పూర్

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×