Ind vs Pak : ఆసియా కప్ 2025లో భాగంగా లీగ్ దశలో మ్యాచ్ లు ముగిసిపోయాయి. ఇవాళ్టి నుంచి సూపర్ 4 మ్యాచ్ లు జరుగనున్నాయి. అయితే ఇవాళ తొలి మ్యాచ్ బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ జరుగుతోంది. రేపు టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగబోతుంది. అయితే ఈ మ్యాచ్ కి ముందు పాకిస్తాన్ కి ఐసీసీ మరో షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ లీగ్ దశలో జరిగిన మ్యాచ్ కి మ్యాచ్ రిఫరీ గా ఆండి పైక్రాప్ట్ వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ రిఫరీగా ఆండి పైక్రాప్ట్ ని తొలగించాలని.. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పొలిటికల్ కామెంట్స్ చేశాడని పాకిస్తాన్ ఆటగాళ్లు అప్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో హోటల్ లోనే ఉండిపోయారు. ఆ తరువాత పీసీబీ స్పందించి హోటల్ నుంచి ఆటగాళ్లను రప్పించింది. తాజాగా మరో షాక్ ఇచ్చింది ఐసీసీ. రేపు జరగనున్న ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తారు.
Also Read : Hardik Pandya : ఇదేక్కడి విచిత్రం.. బ్యాటర్ నాటౌట్.. పెవిలియన్ చేరింది మరొకరు..!
అయితే టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 14 జరిగిన మ్యాచ్ లో టాస్ వేసే సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మరోవైపు టీమిండియా విజయం సాధించిన తరువాత కూడా క్రీజులో ఉన్న సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లిపోయారు. ఈ విషయం పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అయితే ఐసీసీ స్పందించి వివరణ కోరగా.. వాస్తవానికి ఏసీసీ నిర్ణయించిందని పీసీబీకి కూడా సమాచారం ఉందని తెలుస్తోంది. కానీ పీసీబీ, పాకిస్తాన్ ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇష్యూ ని రాద్దాంతం చేస్తూ.. అప్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ సమయంలో హోటల్ లోనే ఉండిపోయారు. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అయింది. మరోవైపు పాకిస్తాన్ జట్టు మ్యాచ్ రిఫరీగా పాకిస్తాన్ ఆడే మ్యాచ్ లకు ఉండకూడదని డిమాండ్ చేసింది. అయితే ఐసీసీ మాత్రం అప్గానిస్తాన్ తో ఆడిన మ్యాచ్ కి ఆండి పైక్రాఫ్ట్ నే మ్యాచ్ రిఫరీగా కొనసాగించింది. మరోవైపు సూపర్ 4లో సెప్టెంబర్ 21న ఆడే టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కి కూడా అతన్నే కొనసాగించనున్నట్టు సమాచారం.
లీగ్ దశలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కి ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే రేపు మరోసారి క్రికెట్ ఫ్యాన్స్ కి ఉత్కంఠ మ్యాచ్ కి రంగం సిద్ధమైంది. ఈసారి టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్లు సూపర్ 4 దశలో తలపడేందుకు సిద్దమయ్యాయి. టోర్నమెంట్ లోని గ్రూపు ఏ నుంచి సూపర్ 4 దశకు అర్హత సాధించిన రెండు జట్లు భారత్, పాకిస్తాన్. ఈ రెండు జట్లు మధ్య జరిగే హై వోల్టేజ్ మ్యాచ్ రెండో సూపర్ 4 మ్యాచ్ అవుతోంది. భారత్, పాకిస్తాన్ జట్లు తమ గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచాయి. గ్రూపు దశలో ఆడిన అన్ని మ్యాచ్ ల్లో టీమిండియా విజయం సాధిస్తే.. పాకిస్తాన్ మాత్రం టీమిండియా చేతిలో ఓ మ్యాచ్ లో ఓటమి పాలైంది. మరోవైపు పాకిస్తాన్ నిస్సందేహంగా పుంజుకోవాలని చూస్తుండగా.. మరో విజయంతో ఫైనల్ వైపు తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్ భావిస్తోంది.
🚨 ANDY PYCROFT – THE MATCH REFEREE 🚨
Andy Pycroft will be the Match Referee for the India vs Pakistan match tomorrow. [Kushan Sarkar] pic.twitter.com/G4ltIhf66X
— Johns. (@CricCrazyJohns) September 20, 2025