Hardik Pandya : ఆసియా కప్ 2025లో భాగంగా టీమిండియా వర్సెస్ ఒమన్ మధ్య లీగ్ దశలో మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ చేసింది. భారత ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ లో ఓ నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. వాస్తవానికి బ్యాటర్ సంజు శాంసన్ ను ఔట్ చేయాల్సిన బంతి హార్దిక్ పాండ్యా కి ఎండ్ కార్డు గా మారింది. ఈ విచిత్ర సంఘటనను చూసం అంతా ఆశ్చర్యపోయారు. దురుదృష్టవశాత్తు హార్దిక్ పాండ్యా కేవలం ఒకే ఒక్క పరుగు మాత్రమే చేసి రనౌట్ గా వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా ఒమన్ ను 21 పరుగుల తేడాతో ఓడించింది. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ 2025 టోర్నమెంట్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది టీమిండియా.
Also Read : SL vs Ban, Super Fours: ఇవాళ లంక, బంగ్లా మధ్య మ్యాచ్.. సూపర్ 4 మ్యాచ్ ల షెడ్యూల్ ఇదే
భారత ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ లో సంజు శాంసన్.. హార్దిక్ పాండ్యాకు హృదయ విదారక పరిస్థితిని కల్పించాడు. ఈ ఓవర్ ను ఒమన్ తరపున బౌలింగ్ చేసేందుకు మీడియం పేసర్ జితెన్ రామనంది వచ్చాడు. ఇక ఆ ఓవర్ లో సంజు శాంసన్ మూడో బంతికి స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. బంతి గాలిలో ఉంది. జితెన్ రామనంది క్యాచ్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితేబంతి జితెన్ రామనంది చేతిని తాకడంతో పాటు నాన్ స్ట్రైకర్ ఎండ్ వద్ద స్టంప్ ను కూడా తాకింది. దీంతో ఆ సమయంలో నాన్ స్ట్రైకర్ లో ఉన్న హార్దిక్ పాండ్యా క్రీజులో లేడు. దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. వాస్తవానికి సంజు శాంసన్ స్ట్రెయిట్ డైవ్ క్యాచ్ ని జితెన్ రామనంది పట్టుకొని ఉంటే.. అతను ఔట్ అయ్యేవాడు. కానీ అదే బంతి నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న హార్దిక్ పాండ్యాను రనౌట్ చేసింది. హార్దిక్ పాండ్యా కి ఇది ఒక పీడకలలా మారింది.
తన తప్పు లేకుండానే ఔట్ అయ్యాడు హార్దిక్ పాండ్యా. కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా పటిష్టంగానే బౌలింగ్ చేసాడు. అతను 4 ఓవర్లలో 26 పరుగులకు 1 వికెట్ తీసుకున్నాడు. ఈ బంతికి సంజు శాంసన్ ప్రాణం పోసుకున్నాడనే చెప్పాలి. ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో సంజు శాంసన్ 3వ స్థానంలో బ్యాటింగ్ చేసి.. 45 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో ఒమన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అలాగే బ్యాటింగ్ కూడా బాగానే చేశారు. కానీ చివర్లో భారత బౌలర్లు వికెట్లు తీయడంతో ఒమన్ 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. లేదంటే ఒమన్ విజయం సాధించినంత పని చేసింది. ముఖ్యంగా భారత బౌలర్లకు పెద్ద పరీక్షనే పెట్టారు ఒమన్ బ్యాటర్లు. టీమిండియా 20 ఓవర్లలో 188 పరుగులు చేసి 8 వికెట్లను కోల్పోయింది. ఒమన్ మాత్రం 20 ఓవర్లలో 167 పరుగులు చేసి 4 వికెట్లను కోల్పోయింది. దీంతో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత జట్టు. టీమిండియా తరపున హార్దిక్ పాండ్యా, అర్ష్ దీప్ సింగ్, కుల్దీప్, హర్షిత్ రాణా తలా వికెట్ తీసుకున్నారు. సెప్టెంబర్ 21న ఆదివారం సూపర్ 4 దశలో టీమిండియా మరోసారి పాకిస్తాన్ తో తలపడనుంది.