E-Paper
Advertisement

పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా? ఈ రుచికరమైన హెల్తీ స్నాక్స్‌తో సమస్యకు చెక్

పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా? ఈ రుచికరమైన హెల్తీ స్నాక్స్‌తో సమస్యకు చెక్
Advertisement

ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు చిప్స్, బర్గర్లు, పిజ్జాలు వంటి జంక్ ఫుడ్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇవి రుచిగా ఉన్నప్పటికీ, తరచుగా తింటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లలకు రుచికరంగా ఉండే, పోషకాలు కూడా అందించే ఇంటి వంటలు ఇవ్వడం చాలా ముఖ్యం. ఇంట్లో తయారుచేసే ఆరోగ్యకరమైన స్నాక్స్ పిల్లల శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంతో పాటు మంచి ఆహారపు అలవాట్లను కూడా పెంచుతాయి. ప్రతి సాయంత్రం పిల్లలు ఆసక్తిగా అడిగే ఐదు సులభమైన స్నాక్స్ ఇవి.

1. సుజీ, కూరగాయల దోశ

చాలా మంది పిల్లలు కూరగాయలు తినడానికి ఇష్టపడరు. అలాంటి సమయంలో సుజీ దోశ మంచి ఎంపిక అవుతుంది. సుజీలో పెరుగు, కొద్దిగా నీరు కలిపి గట్టిగా పిండి తయారు చేయాలి. అందులో క్యారెట్, టమాటా, ఉల్లిపాయ, క్యాప్సికం వంటి సన్నగా తరిగిన కూరగాయలు కలపాలి. తరువాత కొద్దిగా నెయ్యి లేదా వెన్నతో పెనంపై రెండు వైపులా కాల్చాలి. ఈ చిల్లా బయటకు కరకరలాడుతూ లోపల మెత్తగా ఉంటుంది. టమాటో కెచప్ లేదా పుదీనా చట్నీతో పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

2. మఖానా రోస్ట్ చాట్

Advertisement

చిప్స్‌కు బదులుగా మఖానా చాట్ ఇవ్వడం మంచి అలవాటు. మఖానాలో కాల్షియం, ప్రోటీన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. కొద్దిగా నెయ్యిలో మఖానాలను క్రిస్పీ వచ్చే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు, చాట్ మసాలా కలపాలి. సన్నగా తరిగిన దోసకాయ, టమాటా, కొద్దిగా నిమ్మరసం కలిపితే రుచికరమైన చాట్ సిద్ధమవుతుంది. ఇది పిల్లలకు ఆరోగ్యకరమైన, రుచికరమైన స్నాక్‌గా ఉంటుంది.

3. ఓట్స్, అరటిపండు పాన్‌కేక్

స్వీట్స్ ఇష్టపడే పిల్లలకు ఈ పాన్‌కేక్ మంచి ప్రత్యామ్నాయం. ముందుగా ఓట్స్‌ను పౌడర్‌గా చేసుకోవాలి. పండిన అరటిపండును మెత్తగా చేసి ఓట్స్‌తో కలపాలి. అందులో పాలు, కొద్దిగా తేనె వేసి పిండిలా తయారు చేయాలి. నాన్‌స్టిక్ పెనంపై చిన్న పాన్‌కేక్‌లుగా కాల్చాలి. ఇవి సహజమైన తీపితో పాటు ఎక్కువసేపు ఎనర్జీనిస్తాయి.

4. ఇంట్లో తయారుచేసిన పొటాటో వెజ్జీస్

Advertisement

ఫ్రెంచ్ ఫ్రైస్‌కు బదులుగా ఇంట్లో చేసిన పొటాటో వెజెస్ మంచి ఎంపిక. ఆలుగడ్డలను పొడవుగా కోసి వాటిపై ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాల పొడి, ఒరేగానో చల్లాలి. తరువాత ఓవెన్‌లో బేక్ చేయాలి లేదా మూతపెట్టి పెనంపై కాల్చాలి. ఇవి బయటకు కరకరలాడుతూ లోపల మెత్తగా ఉంటాయి. పిల్లలు ఈ స్నాక్‌ను ఎంతో ఇష్టపడతారు.

5. ఫ్రూట్ అండ్ నట్స్ యోగర్ట్ పార్ఫేట్

సాయంత్రం స్వల్ప ఆకలి తీర్చేందుకు ఇది అద్భుతమైన స్నాక్. ఒక గ్లాస్‌లో మందంగా ఉండే పెరుగు పొర వేయాలి. తరువాత మామిడి, అరటి, యాపిల్ లేదా స్ట్రాబెర్రీ ముక్కలు వేయాలి. పైగా బాదం, జీడిపప్పు, కిస్మిస్ చల్లాలి. కావాలంటే కొద్దిగా తేనె కలపవచ్చు. రంగురంగుల పొరలతో ఇది ఐస్‌క్రీమ్‌లా కనిపిస్తుంది. అందువల్ల పిల్లలు ఎంతో ఆసక్తిగా తింటారు.

Also Read: పిల్లలను రోజూ స్కూల్ కోసం రెడీ చేయడం మరింత ఈజీ.. ఉదయం వేళ హడావుడిని తగ్గించే టిప్స్ ఇవిగో

జంక్ ఫుడ్ అలవాటు తగ్గించే సులభమైన చిట్కాలు

పిల్లలకు ప్రతిరోజూ ఒకే సమయంలో ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవ్వాలి. ఇంట్లో తాజా పండ్లను అందుబాటులో ఉంచాలి. ప్యాకెట్ స్నాక్స్‌ను తక్కువగా కొనాలి. స్నాక్స్ తయారీలో పిల్లలను కూడా భాగస్వాములను చేయాలి. అందంగా డెకరేట్ చేసి ఈ ఫుడ్స్ వడ్డిస్తే వారు మరింత ఇష్టంగా తింటారు. చిన్న మార్పులు కూడా పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి.

ఆరోగ్యకరమైన ఆహారం రుచికంరగా చేస్తే పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు. ఇంట్లో తయారుచేసే ఈ స్నాక్స్.. జంక్ ఫుడ్‌కు మంచి ప్రత్యామ్నాయం. ఇవి పిల్లలకు పోషకాలు, శక్తి, మంచి ఆహారపు అలవాట్లను అందిస్తాయి. ఈ వంటకాలను వారానికి కొన్ని రోజులు తయారు చేస్తే పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు.

Related News

హెల్దీ రిలేషన్‌షిప్ అంటే ఇదే.. మీ ప్రేమ, పెళ్లి బంధంలో ఈ 7 లక్షణాలు ఉన్నాయా?

మీ భార్య మీతో ఈ విషయాలు దాచిపెడుతోందా? రిలేషెన్‌ షిప్‌పై పడే ప్రభావం ఇదే

జి మెయిల్, ఇన్‌స్టాగ్రామ్, అమెజాన్.. అన్ని అకౌంట్ పాస్ట్‌వర్డ్స్ మర్చిపోతున్నారా? సమస్యకు పరిష్కారం ఇదిగో

చాణక్య నీతి.. ఈ 4 ప్రదేశాల్లో ఇల్లు కొనకూడదు, నిర్మించకూడదు

ఒక్కో సెలైన్ బాటిల్‌కు రూ.15000 చెల్లిస్తున్న యువత.. డాండియా డాన్స్ పిచ్చి.. ఆరోగ్యకరమేనా?

అస్సలు చేదు రాకుండా..కరకరలాడే కాకరకాయ వేపుడు!

15 నిమిషాల్లోనే..నోట్లో కరిగిపోయే కమ్మని రవ్వ బర్ఫీ చేయండిలా!

రెస్టారెంట్ స్టైల్ చికెన్ వేపుడు..ఇలా చేసారంటే టేస్ట్ అదిరిపోద్ది

Big Stories

Advertisement
×