IND VS PAK IN Asia Cup 2027: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (Pakistan vs India ) మధ్య మ్యాచ్ అంటే జనాలు ఎగబడి చూస్తారన్న సంగతి తెలిసిందే. అయితే రెండు దేశాల మధ్య పరిస్థితులు బాగా లేకపోవడంతో కేవలం ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. అలాగే ఆసియా కప్ లో కూడా మ్యాచులు ఆడుతున్నాయి. అయితే ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ లు జరిగిన ఫ్యాన్స్ ఎగబడి చూస్తారు. అలాంటి వారికోసం అదిరిపోయే శుభవార్త అందింది. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. ఆసియా కప్ 2027 టోర్నమెంట్ లో (2027 Asia Cup) భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్ లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టోర్నమెంట్ వన్డే ఫార్మాట్ లో జరగనున్న నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఆడనున్నారు. దీంతో ఫ్యాన్స్ ఎగబడి చూసేందుకు సిద్ధమవుతున్నారు.
ఆసియా కప్ 2027 టోర్నమెంట్ కోసం ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ టోర్నమెంట్ను ఈసారి బంగ్లాదేశ్ లో నిర్వహించనున్నారు. వన్డే వరల్డ్ కప్ 2027 కంటే ముందే ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. 2027 జూన్ 18వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. అంటే ఐపీఎల్ పూర్తయిన వెంటనే ఆసియా కప్ 2027 టోర్నమెంట్ కూడా శురువు అవుతుందన్నమాట. ఈ టోర్నమెంటు కోసం మొత్తం మూడు వేదికలు ఖరారు చేశారు. బంగ్లాదేశ్ లోని మిర్పూర్, చటోగ్రామ్, సిల్హేట్ వేదికలను దాదాపు ఫైనల్ చేశారు.
ఆసియా కప్ 2027 టోర్నమెంట్ వన్డే ఫార్మాట్లో జరగనున్న నేపథ్యంలో రోహిత్ శర్మ, కింగ్ కోహ్లీ బరిలోకి దిగనున్నారు. వన్డే వరల్డ్ కప్ 2027 అక్టోబర్ సమయంలో జరుగుతుంది కాబట్టి… ఈ ఆసియా కప్ టీమిండియాకు ప్రాక్టీస్ కింద బాగా పనికి వస్తుంది. అందులోనూ పాకిస్తాన్ పైన మూడు మ్యాచ్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రూప్ స్టేజిలో కచ్చితంగా పాకిస్తాన్ తో టీమిండియా తలపడుతుంది. ఆ తర్వాత సూపర్ 4 దశలో కూడా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉంటుంది. ఒకవేళ ఈ రెండు జట్లు ఫైనల్ కి వెళ్తే… వరుసగా మూడు మ్యాచ్ లు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్న జరిగిన ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సందర్భంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కానీ అప్పుడు టీ20 ఫార్మాట్లో జరిగితే.. ఇప్పుడు వన్డే ఫార్మాట్ లో టోర్నమెంట్ ఉంటుంది.
🚨 ASIA CUP 2027 UPDATE. 🏆
The 2027 Asia Cup is set to be played in the 50-over format from June 18 to July 4, with Mirpur, Chattogram and Sylhet proposed as host venues. [Cricbuzz]#AsiaCup2027 #Cricket #AsiaCup pic.twitter.com/QF4oNzaMwm
— Clutch Sports (@Clutchsportsz) July 7, 2026