Anushka Sharma: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా మార్చి 2 ఆదివారం రోజున భారత్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కుమారుడు అహన్ ని.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సతీమని, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ముద్దాడింది. ఆదివారం రోజు జరిగిన మ్యాచ్.. విరాట్ కోహ్లీకి 300 వన్డే కావడంతో అనుష్క శర్మ మ్యాచ్ కి హాజరైంది.
Also Read: Hardik Pandya: కుంగ్ ఫూ పాండ్యా….. కేన్ మామకు వెన్నులో వణుకు పుట్టించాడు?
అలాగే రోహిత్ శర్మ భార్య రితిక సజ్దే సైతం తన పిల్లలతో ఈ మ్యాచ్ చూసేందుకు హాజరైంది. ఈ క్రమంలో రితిక సజ్దే ని.. అనుష్క శర్మ పలకరించింది. రోహిత్ కుమారుడు అహన్ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంది. అనంతరం రితిక ఒడిలో ఉన్న అహన్ ని అనుష్క శర్మ ముద్దాడింది. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో రోహిత్, విరాట్ కి విభేదాలు ఉన్నట్లు తరచూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే అనుష్క, రితిక మధ్య కూడా మాటలు లేవని ప్రచారం జరిగింది. అంతేకాకుండా వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. అయితే గతంలో రితిక.. విరాట్ కోహ్లీకి మేనేజర్ గా పనిచేసింది. వీరిద్దరి మధ్య ఉన్న చనువే అనుష్క శర్మకు కోపం తెప్పించిందని పుకార్లు గతంలో వెలువడ్డాయి.
ఏది ఏమైనా.. తాజాగా వైరల్ గా మారిన ఈ వీడియో పట్ల ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అహన్ ఈ ఏడాది జనవరిలో జన్మించిన విషయం తెలిసిందే. తన భార్య రెండవ బిడ్డకు జన్మనిస్తున్న నేపథ్యంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ కి రోహిత్ శర్మ దూరం అయ్యాడు. ఇక రోహిత్ శర్మ తన మేనేజర్ రితికాని 2017 డిసెంబర్ 13న వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత 2018 డిసెంబర్ 30న వీరికి సమైరా కుమార్తె జన్మించింది.
Also Read: Wpl 2025: టోర్నమెంట్ నుంచి RCB ఔట్…. సెమిస్ వెళ్లే జట్లు ఇవే.. ఇదిగో లెక్కలు?
సమైరాకి ఇప్పుడు ఆరు ఏళ్ళు. ఇక ప్రస్తుతం కొడుకు పుట్టిన ఆనందంలో ఉన్నాడు రోహిత్ శర్మ. ఇదిలా ఉంటే.. ఆదివారం రోజు జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం సాధించడంతో గ్రూప్ – ఎ లో అగ్రస్థానానికి చేరింది. దీంతో సెమీస్ లో భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. మార్చి 4న దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ చేరుకోవడంతోపాటు 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కి ప్రతీకారం తీర్చుకోవాలని భారత క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.
Ritika Bhabhi is with Ahaan at the stadium and Anushka Bhabhi is meeting Ahaan.😭🥹❤️
but I am still not sure whether this is Ritika Bhabhi or someone else. pic.twitter.com/bDZrMU55yU
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 2, 2025