OTT Movie : పెళ్లయిన తర్వాత కొంతమంది అబ్బాయిలు బావిలో కప్పలుగా బతుకుతూ ఉంటారు. ఇల్లరికం వెళితే ఆ పరిస్థితి ఎక్కువగానే ఉంటుంది. వాళ్ళ పరిస్తితి లోపల పెట్టుకోలేక, బయట చెప్పుకోలేక బాత్రూంలో ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని, వాళ్ల కంపెనీ లో జాబ్ చేస్తాడు భర్త. ఆ తర్వాత అతని జీవితం ఎలా వెళ్ళింది అనేదే ఈ స్టోరీ. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ రొమాంటిక్ హాలీవుడ్ మూవీ పేరు ‘మీట్ బిల్’ (Meet Bill). దీనిని బెర్నీ గోల్డ్‌మన్, మెలిసా వాలాక్ రచించి దర్శకత్వం వహించారు. ఈ అమెరికన్ రొమాంటిక్ మూవీలో ఆరోన్ ఎకార్ట్ టైటిల్ క్యారెక్టర్‌గా నటించారు. ఇందులో లోగాన్ లెర్మాన్, జెస్సికా ఆల్బా, ఎలిజబెత్ బ్యాంక్స్ మరియు తిమోతీ ఒలిఫాంట్ సహాయక పాత్రలు పోషించారు. ఇల్లరికంలో ఉండే కష్టాలను, హాలీవుడ్ సినిమాలో చక్కగా చూపించారు. ఈ రొమాంటిక్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
బిల్ ఒక బాగా డబ్బున్న ఇంటికి అల్లుడు అవుతాడు. భార్య కంపెనీలో ఒక జాబ్ చేస్తూ ఉంటాడు. అయితే భార్య ఇతన్ని పెద్దగా పట్టించుకోదు. ఆఫీసులో కూడా ఇతని మాటలకు ఎవరూ విలువ ఇవ్వరు. ఒక లబ్బరు బొమ్మలా అతని జీవితం ఉంటుంది. భార్యకి భర్త మీద ఇంట్రెస్ట్ పోయి, ఎవరితో అయినా ఎఫైర్ పెట్టుకోవాలనుకుంటుంది. ఆ తరువాత తన స్నేహితుడితో ఎఫైర్ పెట్టుకుంటుంది భార్య. బిల్ కి ఆమె మీద అనుమానం వచ్చి బెడ్రూంలో కెమెరా పెడతాడు. ఆఫీస్ కి వెళ్లి తిరిగి వచ్చి వీడియోను చూస్తే, బాయ్ ఫ్రెండ్ తో భార్య మంచం మీద రెచ్చిపోతూ ఉంటుంది. ఆ వీడియో చూసి భర్త గుండె జారిపోతుంది. ఆ తర్వాత భార్యతో గొడవపడి సపరేట్ అవుతాడు. అయినా సరే భార్యతో జీవించాలనుకుంటాడు. ఈ క్రమంలో బిల్ కి శ్యామ్ అనే స్టూడెంట్ పరిచయం అవుతాడు.
కొంతమంది స్టూడెంట్స్ కి, కొంతమంది వ్యక్తులు మోటివేషన్ ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో శ్యామ్ కి లైఫ్ లో ఇన్స్పైర్ అయ్యే విధంగా మోటివేషన్ ఇవ్వాలని బిల్ కి యాజమాన్యం చెబుతుంది. అయితే బిల్ మాత్రం తన బాధను అతనికి చెప్పుకుంటాడు. పెళ్లి తరువాత తాను ఏమి కోల్పోయాడో తలుచుకొని బాధపడతాడు. ఇది విని శ్యామ్ తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి వీళ్లిద్దరిని కలపడానికి ట్రై చేస్తాడు. చివరికి ఈ భార్యాభర్తలు కలుస్తారా? విడిపోయి స్వేచ్ఛను పొందుతారా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘మీట్ బిల్’ (Meet Bill) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.