BigTV English
Advertisement

Hardik Pandya: కుంగ్ ఫూ పాండ్యా….. కేన్ మామకు వెన్నులో వణుకు పుట్టించాడు?

Hardik Pandya: కుంగ్ ఫూ పాండ్యా….. కేన్ మామకు వెన్నులో వణుకు పుట్టించాడు?

Hardik Pandya: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా నేడు న్యూజిలాండ్ – టీమిండియా మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఇరుజట్లు ఇప్పటికే సెమీస్ చేరినప్పటికీ.. ఇది నామమాత్రపు మ్యాచ్ మాత్రం కాదు. ఎందుకంటే సెమీస్ లో ఏ జట్టుతో టీమ్ ఇండియా మ్యాచ్ ఆడాలో ఈ మ్యాచ్ డిసైడ్ చేస్తుంది. గ్రూప్ ఎ లో భాగంగా జరుగుతున్న ఈ చివరి లీగ్ మ్యాచ్.. సెమీస్ లో ఏయే జట్లు తలపడబోతున్నాయో తేల్చేస్తుంది.


 

ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీస్ లో ఆస్ట్రేలియా తో పోటీ పడుతుంది. ఇక ఓడిన జట్టు సౌత్ ఆఫ్రికా తో సెమీస్ మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ ఏ నుండి ఇప్పటికే బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లు, గ్రూప్ బి నుండి అప్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్టు ఇంటిదారి పట్టాయి. అలాంటి ఈ కీలకమైన మ్యాచ్ లో నేడు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కి దిగింది టీం ఇండియా. కానీ ఆరంభంలోనే భారత జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. పవర్ ప్లే లోనే టాప్ 3 వికెట్లను కోల్పోయింది భారత్. ఓపెన్ గిల్ {2} ని మ్యాట్ హెన్రీ బోల్తా కొట్టించాడు. దురదృష్టవశాత్తు గిల్ ఎల్బిడబ్ల్యు గా అవుట్ అయ్యాడు.


ఆ వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ {15} పరుగుల వద్ద పుల్ షాట్ ఆడబోయి జేమీసన్ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ తో కలిసి కాస్త దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన విరాట్ కోహ్లీని.. కళ్ళు చెదిరే క్యాచ్ తో షాక్ ఇచ్చాడు గ్లెయిన్ ఫిలిప్స్. ఆ క్యాచ్ చూసి విరాట్ కోహ్లీ కూడా షాక్ అయ్యాడు. దీంతో భారత్ 30 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అలాంటి పరిస్థితిలో అక్షర్ పటేల్ తో కలిసి శ్రేయస్ అయ్యర్ జట్టును ఆదుకున్నాడు.

వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ క్రీజ్ లో సెట్ అయ్యారు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ 79 పరుగులు, అక్షర్ పటేల్ 42 పరుగులతో.. 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తరువాత వేగంగా ఆడే క్రమంలో శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యాడు. ఇక ఆఫ్ సెంచరీ సమయంలో అక్షర్ పటేల్ ని.. కేన్ విలియమ్ సన్ స్టన్నింగ్ క్యాచ్ పట్టి అవుట్ చేశాడు. ఆ తర్వాత రాహుల్ {23}, శ్రేయస్ అయ్యర్ {79} పరుగులకి పేవిలియన్ చేరారు.

 

అనంతరం హార్దిక్ పాండ్యా {45} కాస్త వేగంగా ఆడడంతో భారత్ చెప్పుకోదగిన స్కోరు సాధించింది. అయితే హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ బంతిని ఆఫ్ సైడ్ స్క్వేర్ వైపు భారీ షాట్ ఆడాడు. ఈ బంతిని పట్టుకున్న కేన్ విలియమ్ సన్.. వెంటనే ఆ బంతిని వదిలేసి చేతులు ఝలిపిస్తూ.. ఓ రకమైన డాన్స్ చేశాడు. ఆ బంతిని అంత బలంగా కొట్టాడు కుంగ్ ఫు పాండ్యా. దీంతో ఈ షాట్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు హార్దిక్ పాండ్యా.. కేన్ మామ వెన్నులో వణుకు పుట్టించాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక చివరకు టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి ద‌గ్గ‌ర క‌ల‌క‌లం…కేక్ తీసుకొచ్చిన ఆగంత‌కుడు !

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Big Stories

×