Vamika Kohli: ఫాదర్స్ డే…. సందర్భంగా చాలా మంది సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా వారి తండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ క్రికెటర్ కోహ్లీ కూతురు వమిక తన చేతిరాతతో లెటర్ రాసి కోహ్లీకి అందజేసింది. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అతి చిన్న వయసులోనే కేవలం నాలుగేళ్లలోనే వామిక హ్యాండ్ రైటింగ్ చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ఈ లెటర్ లో వామిక “అతను నా సోదరుడు లాంటోడు. చాలా ఫన్నీగా ఉంటాడని పేర్కొంది. అతను నాకు చక్కిలిగింతలు పెడతారు. నేను అతనితో మేకప్ ఆటను ఆడుకుంటాను. నేను అతడిని చాలా ప్రేమిస్తున్నాను. అతను నన్ను చాలా ప్రేమిస్తున్నాడు. హ్యాపీ ఫాదర్స్ డే” అని రాసుకొచ్చింది వమిక. ఈ లెటర్ ను అనుష్క శర్మ తన ఇన్ స్టాలో షేర్ చేసుకుంది. ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఇంత చిన్న వయసులో తన తండ్రి గురించి ఇంత చక్కగా రాసుకొచ్చిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే అది వామిక హ్యాండ్ రైటింగ్ కాదని… వేరేవాళ్లు రాసారని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: SA Won WTC Final: బవుమా చేతిలో ఆసీస్ చిత్తు.. WTC ఛాంపియన్ గా సౌతాఫ్రికా..27 ఏళ్ళ తర్వాత
అనుష్క శర్మ, కోహ్లీ ప్రేమ బంధం
కాగా, అనుష్క శర్మ కోహ్లీ 2017 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2021లో అమ్మాయి జన్మించింది. కానీ ఇప్పటివరకు వమిక ఫేస్ ను కోహ్లీ, అనుష్క రివిల్ చేయలేదు. బయటకి కూడా పెద్దగా తీసుకురారు. ఒకవేళ తీసుకువచ్చినా కూడా ఫోటోలు తీయడానికి అసలు ఒప్పుకోరు. వమిక ఫోటోలను అందరూ సోషల్ మీడియాలో షేర్ చేయడం వారికి ఇష్టం లేదని గతంలోనే స్పష్టం చేశారు. ఈ కారణంగా కోహ్లీ తన కూతురు, కుమారుడి ఫోటోలను ఎక్కడా కూడా కనిపించకుండా జాగ్రత్త పడతారు. ఇదిలా ఉండగా…. కోహ్లీ, అనుష్క శర్మ వారి పిల్లలతో కలిసి లండన్ లో ఉంటున్నారు. అక్కడ చాలా ప్రశాంతంగా ఉండవచ్చని భావించి లండన్ లో ఉండడానికి ఫిక్స్ అయ్యారు.
18 ఏళ్ళ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్
కాగా కోహ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో మ్యాచులు ఆడగా 18 సంవత్సరాల కు విజయం సాధించాడు. ఆర్సిబి జట్టు 18 సంవత్సరాలకు ట్రోఫీ గెలిచింది. దీంతో ఆర్సిబి అభిమానులు, జట్టు సభ్యులు విపరీతంగా సంబరాలు చేసుకున్నారు. మరోవైపు ఆర్సిబి జట్టు విజయం సాధించడంతో కొంతమంది ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. రోడ్లపై బయట వింత చేష్టలు చేయడంతో మరణించారు. మరికొంతమంది బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందారు.
విజయోత్సవ ర్యాలీని నిర్వహించిన సమయంలో చిన్నస్వామి స్టేడియంకు భారీగా అభిమానులు తరలివచ్చారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 11 మంది మరణించారు. మరి కొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరణించిన వారి కుటుంబాలకు భారీగా నష్టపరిహారాన్ని చెల్లించారు. అంతేకాకుండా గాయపడ్డ వారికి కూడా కొంత మొత్తంలో నష్టపరిహారాన్ని అందించారు. ఈ ఘటనపై కోహ్లీ ఇప్పటివరకు పెద్దగా రియాక్ట్ అవలేదు. దీంతో ఆర్సిబి అభిమానులు సీరియస్ అవుతున్నారు.
Also Read: Anushka Shetty: టీమిండియా ప్లేయర్ తో అనుష్క పెళ్లి.. తనకంటే తక్కువ వయసు ప్లేయర్ తోనే ?