Kantara 2: ప్రముఖ కన్నడ దర్శకుడు, సినీ నటుడు రిషబ్ శెట్టి(Rishabh Shetty) కాంతారా (Kanatara) సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ కావడమే కాకుండా రిషబ్ ఏకంగా నేషనల్ అవార్డును కూడా అందుకున్న విషయం తెలిసిందే. ఇలా మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమాకు సీక్వెల్ గా కాంతారా 2 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి సినిమా యూనిట్ లో పెద్ద ఎత్తున ప్రమాదాలు చోటు చేసుకోవడం, సినిమా కోసం పనిచేస్తున్నటువంటి ఆర్టిస్టులు చనిపోవడం జరిగింది.
ఇలా కాంతారా సినిమా కోసం పనిచేస్తున్న సమయంలో ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకోవడంతో పలువురు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా చిత్ర బృందం కర్ణాటకలోని మస్తీకట్ట వద్ద ఉన్న రిజర్వాయర్లో కొన్ని సన్నివేశాలను షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. రాత్రివేళ షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో సుమారు 30 మంది వరకు ఒక పడవలో ప్రయాణిస్తూ రిజర్వాయర్లో షూటింగ్ జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ పడవ కాస్త బోల్తా పడిందని వార్తలు బయటకు వచ్చాయి.
పడవ ప్రమాదం..
ఇలా పడవ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అందరూ కూడా ఈత కొట్టుకుంటూ క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారని తెలుస్తోంది. ఇలా ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో అందరూ భయాందోళనలకు గురవుతున్నారు. ఇలా సినిమా షూటింగ్ సమయంలో వరుస విషాదాలు చోటు చేసుకోవడం దేనికి సంకేతం అనే భయాందోళనలను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ ఘటనపై చిత్ర నిర్మాణ సంస్థ స్పందించారు.
భూత కోల ప్రదర్శన..
ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ హోంభలే ఫిలిమ్స్ వారు స్పందిస్తూ కాంతారా సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగిందంటూ వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్లో భాగంగా జలాశయం వద్ద తాము పెద్ద సెట్ వేసామని, ఆ సమయంలో పెద్ద ఎత్తున గాలి రావటం వల్ల గాలికి సెట్ మొత్తం దెబ్బతినిందని తెలిపారు. అయితే ఈ ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో సెట్ లోపల ఎవరూ లేకపోవడం వల్ల ఎవరికి ఏమి జరగలేదని హోంభలే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఈ ఘటన గురించి వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని అవన్నీ అవాస్తవాలేనని తెలిపారు. ఇలా చిత్ర బృందం ఈ ఘటనపై స్పందించి క్లారిటీ ఇవ్వడంతో ఒకసారిగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ సినిమా దాదాపు షూటింగ్ పనులను పూర్తి చేసుకుందని తెలుస్తుంది. అతి త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా కర్ణాటకలోని ఒక మారుమూల గ్రామంలో నివసించే ప్రజల జీవన విధానం, వారి ఆచార వ్యవహారాల ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమాలో భూత కోల ప్రదర్శన ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసింది.