E-Paper
Advertisement

ఇంగ్లాండ్ చేతిలో ఓట‌మి, ఒలింపిక్స్ నుంచి టీమిండియా ఔట్? రంగంలోకి పాకిస్తాన్‌

ఇంగ్లాండ్ చేతిలో ఓట‌మి, ఒలింపిక్స్ నుంచి టీమిండియా ఔట్? రంగంలోకి పాకిస్తాన్‌
Advertisement

LA Olympics 2028:  ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా టీ20 సిరీస్ కోల్పోయింది. ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన టీమిండియా, ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో కూడా వైట్ వాష్ అయ్యే ప్రమాదం కొని తెచ్చుకుంది. ఒక్కడుంటే ఒక్కడు కూడా సరిగ్గా ఆడడం లేదు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఇప్పటివరకు మొత్తం ఐదు టి20లలో టీమిండియా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఐసీసీ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉన్న టీమిండియా.. దిగజారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ దెబ్బకు లాస్ ఏంజెల్స్ 2028 ఒలంపిక్స్ నుంచి టీమిండియా వైదొలగే ప్రమాదం పొంచి ఉంది. ఆసియా ఖండం నుంచి ఖచ్చితంగా టీమిండియా.. స్థానం దక్కించుకుంటుందని అందరు అనుకుంటున్న నేపథ్యంలో… వరుస ఓటములు టెన్షన్ తెప్పిస్తున్నాయి. ఒకవేళ ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా దిగజారితే.. పాకిస్తాన్ క్వాలిఫై అవుతుంది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది.

Also Read: Inzamam-ul-Haq Reaction On Team India Kohli Vs Shreyas Iyer : కోహ్లీ కంటే శ్రేయ‌స్ అయ్య‌రే బెట‌ర్ కెప్టెన్‌..టీమిండియాకు ఎలాంటి ఢోకా లేదు

ఒలంపిక్స్ నుంచి టీమిండియా వైదొలిగే ప్రమాదం

Advertisement

ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ చేతుల్లో టీమిండియా వరుసగా 5 టీ20 లో ఓడిపోయింది. అయినప్పటికీ ప్రస్తుతం అయితే టీమిండియా మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఐసీసీ ర్యాంకింగ్స్ లో 269 పాయింట్లు టీమిండియా ఖాతాలో ఉన్నాయి. పాకిస్తాన్ ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఒలంపిక్స్ లో ఆసియా తరఫున.. ఒకే ఒక్క జట్టు పాల్గొనాలి. 2027 డిసెంబర్ నాటికి ర్యాంకింగ్స్ లో ఆసియా ఖండంలో ఏ జట్టు, టి20 ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉంటుందో ? ఆ జట్టు ఒలంపిక్స్ కు అర్హత సాధిస్తుంది. ఆసియా ఖండంలో టీమిండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ లాంటి బలమైన జట్లు ఉన్నాయి. కానీ అవకాశం మాత్రం టీమిండియా తో పాటు పాకిస్తాన్ కు ఉంది. టీమిండియా వరుసగా ఇలాగే ఓడిపోతూ ర్యాంకింగ్ కోల్పోతే మాత్రం… పాకిస్తాన్ కు 2028 ఒలంపిక్స్ లో ఆడే అవకాశం దక్కుతుంది. ఇప్పుడు ఇదే అంశం టీమిండియాను వనికిస్తోంది.

టీమిండియాను ముంచుతున్న ఐపిఎల్ ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో అద్భుతంగా రాణించిన టీమిండియా ప్లేయర్లు… ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ గడ్డపై మాత్రం తేలిపోయారు. దీనికి ముఖ్య కారణం ఐపిఎల్ కోసం తయారుచేసిన మైదానాలు అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఐపీఎల్ సమయంలో హైవే లాంటి మైదానాలు తయారు చేసి… టీమిండియా ప్లేయర్ల కెరీర్ నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అలవాటైన టీమ్ ఇండియా క్రికెటర్లు… ఇంగ్లాండ్ అలాగే ఐర్లాండ్ లో మాత్రం చెత్త ప్రదర్శన కనబరుస్తున్నట్లు ట్రోలింగ్ చేస్తున్నారు. దీనికి బీసీసీఐ బాధ్యత వహించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇకపైన ఐపిఎల్ లో బౌలింగ్ పిచ్ లు సిద్ధం చేయాలని కోరుతున్నారు. అలాగే టీమ్ ఇండియా ప్లేయర్లకు రెస్ట్ కూడా అవసరం అన్నారు. విదేశీ మైదానాలలో ఆడే, బ్యాటర్లను సిద్ధం చేయాలని కోరుతున్నారు.

Advertisement

Also Read: Mohammad kaif blasts selectors Over Team India Vs England : శివమ్‌ దూబే కంటే ముందు హ‌ర్షిత్ రాణాను తీసుకురావ‌డం గంభీర్ ముర్ఖ‌త్వమే 

 

 

 

Related News

CSK, ధోని మ‌ధ్య చిచ్చు పెట్టిన కిలాడీ లేడీ ?

రంభ ఊర్వశి మేనక మూవీలో గౌత‌మ్ గంభీర్..ఇక థియేట‌ర్లు బ‌ద్ద‌లు కొట్టాల్సిందే

బ్యాటింగ్ చేత‌కాదు కానీ, రౌడీలా ఫైటింగ్ చేస్తున్నాడు

వీల్ చైర్ పై వచ్చైనా రెండో టెస్టులో బాబ‌ర్ ఆజం ఆడాలి

మొద‌టి బంతికే 80 ప‌రుగులు…టీమిండియా క్రికెట‌ర్ స‌రికొత్త రికార్డ్

గ‌జ దొంగ‌ న‌ఖ్వీ ప‌క్క‌న కూర్చోడానికి సిగ్గులేదా ? శుక్లా ప‌రువు తీసిన ఇర్ఫాన్ ప‌ఠాన్‌

సారా ప్రైవేట్ పార్ట్స్ వీడియో తీసే ప్ర‌య‌త్నం… వార్నింగ్ ఇచ్చిన సచిన్ !

లైవ్ మ్యాచ్ లో కండ‌లు చూపించిన ధ్రువ్ జురెల్ బ్యాన్ వేయాల్సిందే !

Big Stories

Advertisement
×