BigTV English

Argentina enter FIFA World Cup semi-finals :అర్జెంటీనా అదుర్స్..

Argentina enter FIFA World Cup semi-finals :అర్జెంటీనా అదుర్స్..

Argentina enter FIFA World Cup semi-finals : ఫిఫా వరల్డ్‌కప్‌ను ఒడిసి పట్టేందుకు అర్జెంటీనా మరో రెండు అడుగుల దూరంలో నిలిచింది. హోరాహోరీగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ మీద తిరుగులేని విజయం సాధించి సెమీఫైనల్లో అడుగుపెట్టింది… అర్జెంటీనా. మ్యాచ్ ముగిసే సమయానికి రెండు జట్లు చెరి రెండు గోల్స్ చేయడంతో… షూటౌట్‌కు దారి తీసింది. అర్జెంటీనా 4 గోల్స్ చేయగా… నెదర్లాండ్స్ 3 మాత్రమే వేసి… టోర్నీ నుంచి నిష్క్రమించింది.


ఆట ఆరంభం నుంచే రెండు జట్లు నువ్వా? నేనా? అన్నట్లు తలపడ్డాయి. పరస్పరం గోల్ పోస్టుల మీద దాడులు చేసుకున్నాయి. అయితే ఆట 35వ నిమిషంలో అర్జెంటీనా గోల్ కొట్టడంలో సక్సెస్ అయింది. ఆ జట్టు ఆటగాడు నాహెల్ మోలినా… నెదర్లాండ్స్ రక్షణ శ్రేణిని దాటుకుని అద్భుత గోల్ కొట్టాడు. తొలి అర్ధభాగం ముగిసేసరికి అర్జెంటీనా 1-0 గోల్స్ ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలోనూ ఆ జట్టుదే పైచేయి అయింది. అర్జెంటీనా స్టార్ ఆటగాడు మెస్సీ… 73వ నిమిషంలో గోల్ చేశాడు. దాంతో… అర్జెంటీనా 2-0 గోల్స్ తేడాతో ఆధిక్యంలో నిలవడంతో… విజయం ఖాయమని ఆ జట్టు అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. కానీ నెదర్లాండ్స్ చివరి వరకూ పోరాడింది. ఆ జట్టు ఆటగాడు వౌట్ వేగోర్ట్స్ 83వ నిమిషంలోనూ, ఆట అదనపు సమయంలో 101వ నిమిషంలోనూ రెండు గోల్స్ వేసి… అర్జెంటీనాకు షాకిచ్చాడు. చివరికి నెదర్లాండ్స్, అర్జెంటీనా 2-2 గోల్స్ చేసి సమానంగా నిలవడంతో… మ్యాచ్ షూటౌట్‌కు దారితీసింది.

షూటౌట్‌ కూడా రెండు దేశాల అభిమానుల్ని మునివేళ్ల మీద నిలబెట్టింది. తొలి ప్రయత్నంలో రెండు జట్లు గోల్ కొట్టడంలో విజయవంతమయ్యాయి. రెండో ప్రయత్నంలో నెదర్లాండ్స్ గోల్ కొట్టగా… అర్జెంటీనా విఫలమైంది. మూడో ప్రయత్నంలో రెండు జట్లు గోల్ కొట్టాయి. అప్పటికి నెదర్లాండ్స్ 3-2 గోల్స్ తేడాతో ఆధిక్యంలో ఉంది. తీవ్ర ఒత్తిడిలో అర్జెంటీనా చివరి రెండు ప్రయత్నాల్లో గోల్ చేయగా… నెదర్లాండ్స్ విఫలమైంది. దాంతో చివరికి 4-3 గోల్స్ ఆధిక్యంలో నిలిచిన అర్జెంటీనా సెమీస్ చేరింది. సెమీఫైనల్లో క్రొయేషియాతో తలపడనుంది… అర్జెంటీనా.


Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×