
Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్. ఆడుతున్నది ఫస్ట్ ఐపీఎల్. అయినా ఎలాంటి టెన్షన్ లేదు. కూల్‌గా ఆడుతున్నాడు. చిన్నప్పటి నుంచీ క్రికెట్‌లోనే పెరిగాడు. తండ్రి ఆటను చూస్తూ ఎదిగాడు. పూర్తిగా క్రికెటర్‌గా మారాక.. ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఊరిస్తూ, ఉసూరుమనిపిస్తూ, మెప్పిస్తూ.. అలా అలా సాగుతోంది అర్జున్ ఆటతీరు.
ఫోర్ కొట్టకుండానే.. ఐపీఎల్‌లో తొలి సిక్స్ బాదేశాడు అర్జున్ టెండూల్కర్. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో తొమ్మిదో నెంబర్ ఆటగాడిగా క్రీజులోకి వచ్చిన అర్జున్.. మోహిత్ శర్మ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టాడు. మోహిత్ షార్ట్ బాల్ వేయగా.. అర్జున్ డీప్‌స్వ్కేర్ దిశగా లాంగ్ సిక్సర్ బాదేయడం భలే ఉంది. అర్జున్ కొట్టిన బాల్ గాల్లోకి లేవగానే.. బౌలర్ మోహిత్ రియాక్షన్ మరింత హైలైట్‌గా నిలిచింది. ఫేస్ అదోలా పెట్టి బాగా డిసప్పాయింటెడ్‌గా కనిపించాడు మోహిత్.
బౌలర్‌గా అర్జున్‌పై మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్‌లో 2 ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చాడు.. ఫర్వాలేదనిపించాడు. ఇక రెండో మ్యాచ్‌లో సన్ రైజర్స్ మీద ఆడినప్పుడు భువనేశ్వర్ వికెట్ తీసి శభాష్ అనిపించుకున్నాడు. కానీ, మూడో మ్యాచ్‌కి వచ్చే సరికి ఆ పేరంతా పోగొట్టుకున్నాడు. మూడు ఓవర్లు వేసి ఏకంగా 48 పరుగులు సమర్పించుకున్నాడు. ముంబై బౌలర్స్‌లలో ఇన్ని పరుగులు ఇచ్చిన బౌలర్ లేరు. ఇలా బాల్‌తో ఏదోలా నెట్టుకొస్తున్న అర్జున్.. నాలుగో మ్యాచ్‌లో బ్యాట్‌కు పని చెప్పి.. సిక్స్‌తో శభాష్ అనిపించుకుంటున్నాడు.
ఒక్క సిక్స్‌తో రావాల్సినంత ఫేమ్ వచ్చేసినట్టుంది. అర్జున్ టెండూల్కర్‌కు బ్యాటింగ్‌లో ప్రమోషన్ ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. అర్జున్‌లో ఆల్‌రౌండ్ టాలెంట్ ఉందని.. ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌కు దింపితే మరింత మెరుగైన స్కోర్ చేస్తాడంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.