BigTV English

Arjun Tendulkar:- ఒక్క బాల్ వేయని వాళ్లు కూడా మాట్లాడేవారే.. అర్జున్ టెండూల్కర్‌కు బ్రెట్‌లీ సర్టిఫికేట్

Arjun Tendulkar:- ఒక్క బాల్ వేయని వాళ్లు కూడా మాట్లాడేవారే.. అర్జున్ టెండూల్కర్‌కు బ్రెట్‌లీ సర్టిఫికేట్

Arjun Tendulkar:- అర్జున్ టెండూల్కర్ ఆడింది నాలుగు మ్యాచ్‌లు. దీనికే రివ్యూలు ఇఛ్చేయడం, విమర్శలు చేయడం, పనికొస్తాడని ఒకరు, పనికిరాడని ఒకరు…అబ్బో ఎన్నెన్ని కామెంట్లో. సోషల్ మీడియాలో అయితే… అదే పనిగా కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ ఆస్ట్రేలియా దిగ్గజం పేసర్ బ్రెట్‌లీ.. అర్జున్ కు అండగా నిలిచాడు. తనకు కూడా ఇలాంటి అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయని చెప్పుకొచ్చాడు.


పేస్ బౌలింగ్‌లో ఎంత స్పీడ్‌తో బంతి విసురుతున్నామన్నది ఇంపార్టెంట్ కాదు. లైన్ అండ్ లెంగ్త్ మాత్రమే ముఖ్యం. స్పీడ్ తోనే వికెట్లు తీయగలం అనుకుంటే.. అక్తర్ ఖాతాలో వరల్డ్ రికార్డ్ అన్నీ ఉండేవి. అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ స్పీడ్ 120 కి.మీ. ఉండడంతో చాలా మంది విమర్శలు చేశారు. కాని, నెట్ ప్రాక్టీస్‌లలో అర్జున్ టెండూల్కర్ 140 కి.మీ. స్పీడ్ తో బాల్స్ వేస్తున్నాడని బ్రెట్‌లీ  చెప్పుకొచ్చాడు. అందులోనూ అర్జున్ వయసు 23 ఏళ్లేనని గుర్తు చేశాడు. అర్జున్ సత్తా చాటడానికి ఇంకా చాలా సమయం ఉందని సపోర్ట్ గా నిలిచాడు.

పైగా అర్జున్ టెండూల్కర్ ఆడుతున్నాడంటే.. ఫోకస్ మొత్తం అతనిపైనే ఉంటుందని, ఇలాంటి పరిస్థితులకు అలవాటు పడడానికి కొంత సమయం పడుతుందని చెప్పుకొచ్చాడు బ్రెట్‌లీ.
పైగా అర్జున్ టెండూల్కర్ పేస్‌ కూడా పెరుగుతోందని, ఇప్పటి వరకు అర్జున్ పేస్‌లో ఎలాంటి సమస్యలను తాను చూడలేదని చెప్పాడు. ఎలా బౌలింగ్‌ చేయాలని అనుకుంటున్నాడో అలాగే చేయాలి తప్ప.. బయట నుంచి విమర్శలు చేసేవారిని పట్టించుకోకూడదన్నారు. అలా కామెంట్ చేసిన వాళ్లు జీవితంలో ఒక్కబంతినైనా వేసి ఉండరని, వాళ్లంతా కీబోర్డు వారియర్లని మండిపడ్డాడు.


కోల్‌కతాతో జరిగిన తొలి మ్యాచ్‌లో కాస్త ఫర్వాలేదనిపించిన అర్జున్.. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు ఓవర్లలోనే ఏకంగా 48 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో తెగ విమర్శలు చేశారు. అయితే, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు ఓవర్లలో అర్జున్ ఒక వికెట్‌ తీసి కేవలం 9 పరుగులను మాత్రమే ఇచ్చి విమర్శకులకు సమాధానమిచ్చాడు. ఈ క్రమంలోనే అర్జున్‌పై విమర్శలు గుప్పించినవారిపై ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. 

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×