Trolls On RCB Players: టీమిండియా జట్టులోకి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లను అస్సలు తీసుకోవద్దంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. అనవసరంగా న్యూజిలాండ్ సిరీస్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సంబంధించిన భువనేశ్వర్ కుమార్ ను బీసీసీఐ పెద్దలు తీసుకున్నారని ఇప్పుడు క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అటు హాంకాంగ్ సిక్సెస్ 2026 సందర్భంగా కృనాల్ పాండ్యాను కెప్టెన్ చేసి భారత్ కొంపముంచారని నిప్పులు చెరుగుతున్నారు.
ఈ ఆర్సీబీ ఆటగాళ్లు ఎంట్రీ ఇవ్వడంతోనే టీమ్ ఇండియాకు ఒకే రోజు రెండు ఓటములు ఎదురయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్ గా ఉన్నన్ని రోజులు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్ల నీడ కూడా టీమిండియాపై పడకుండా చూసుకున్నాడని.. వీళ్ళ విషయంలో అతడే కరెక్ట్ అని ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు అభిమానులు. అజిత్ అగార్కర్ తరహాలోనే ప్రగ్యాన్ ఓజా కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్లపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ప్రతి మ్యాచ్ టీమ్ ఇండియా ఓడిపోతుందని హెచ్చరిస్తున్నారు.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ20 సిరీస్ నేపథ్యంలో సెలెక్ట్ అయిన భువనేశ్వర్ కుమార్ ఆడిన మూడు మ్యాచ్ లలో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఈ మూడింటిలో 139 పరుగులు సమర్పించుకున్న భువనేశ్వర్ కుమార్ కేవలం ఒకే వికెట్ పడగొట్టాడు. ప్రతి మ్యాచ్ లో 12కు పైగా ఎకనామీ రేట్ నమోదు చేసి చెత్త ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలోనే నాలుగో టీ20లో భువనేశ్వర్ కుమార్ ను పక్కకు పెట్టేశాడు గౌతమ్ గంభీర్. అటు హాంకాంగ్ సిక్సెస్ లో భాగంగా టీమిండియా కెప్టెన్ గా కృనాల్ పాండ్యాకు బీసీసీఐ మంచి అవకాశం ఇచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన కృనాల్ పాండ్యా తేలిపోయాడు. కృనాల్ పాండ్యా ఫెయిల్యూర్ కారణంగా పాకిస్తాన్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోవాల్సి వచ్చింది.
అంతేకాదు బ్యాటింగ్ లో డకౌట్ అయిన కృనాల్ పాండ్యా బౌలింగ్ లో ఒకే ఒక్క ఓవర్ వేసి 31 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో ఐదు సిక్సర్లు ఉండడం గమనార్హం. దీంతో కృనాల్ పాండ్యాతో పాటు భువనేశ్వర్ కుమార్ పై ట్రోలింగ్ నడుస్తోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్లకు అజిత్ అగర్కార్, గౌతమ్ గంభీర్ అన్యాయం చేస్తున్నారని అప్పట్లో విమర్శలు చేసిన అభిమానులే ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. బెంగళూరు ప్లేయర్లను పక్కకు పెట్టాలని కోరుతున్నారు. వీళ్ల వల్ల టీమిండియాకు నష్టమే తప్ప లాభం లేదని అంటున్నారు. అజిత్ అగర్కర్ లేని నేపథ్యంలో ప్రగ్యాన్ ఓజా, గౌతమ్ గంభీర్ తెలివిగా వ్యవహరించి బెంగళూరు ప్లేయర్లను సెలెక్ట్ చేయకూడదని కోరుతున్నారు.
?utm_source=ig_web_copy_link&xtok=NTc4MTIwNjQ2YQ==