Shaun Pollock On Temba Bavuma: కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. ఈ తరుణంలోనే తెంబా బవుమాను మెచ్చుకుంటూ సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ షాన్ పొలాక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పొట్టోడా అంటూ తెంబా బవుమాను ట్రోల్ చేశారతీ..వాడే తొక్కితే ఆస్ట్రేలియా పాతళంలో పడిందని షాన్ పొలాక్ హాట్ కామెంట్స్ చేశాడు. తొలి టెస్ట్ గెలిచిన తర్వాత ట్రావిస్ హెడ్ ముందుగా తెంబా బవుమాను గెలికాడని ఫైర్ అయ్యాడు.
దీంతో రెచ్చిపోయిన తెంబా బవుమా, వరుసగా రెండు మ్యాచ్ లలో ఆస్ట్రేలియాను ఓడించినట్టు తెలిపాడు. చిన్నప్పటి నుంచే అతడిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, అందుకే సౌతాఫ్రికాను ఒంటి చేత్తో లీడ్ చేస్తున్నట్టు వెల్లడించాడు. కెప్టెన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత సౌతాఫ్రికా క్రికెట్ రూపురేఖలను మార్చేశాడని ప్రశంసించాడు. ఇక తాజాగా ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్ గెలిచి, ఆ జట్టును పాతళంలోకి తొక్కేశాడని వెల్లడించాడు. మరో పదేళ్లు సౌతాఫ్రికాను ఎదురులేని శక్తిగా తీర్చిదిద్దుతాడని కామెంట్ చేశాడు. ఇలాంటి లీడర్లు ఉంటే, ప్రతీ జట్టు విజయ కేతనం ఎగురవేస్తుందని తెలిపాడు.
కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోయింది. దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ ప్రదర్శనతో 176 పరుగుల తేడాతో కంగారూలు చిత్తయ్యారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 329 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ కంగారులు మాత్రం ఇరగదీశారు. 429 పరుగులతో దుమ్ములేపారు. ఇక రెండో ఇన్నింగ్స్ లో పుంజుకున్న దక్షిణాఫ్రికా 387 పరుగులతో రాణించింది. అయితే, రెండో ఇన్నింగ్స్ లో తేలిపోయిన ఆస్ట్రేలియా 111 పరుగులకే కుప్పకూలింది. దీంతో సౌతాఫ్రికా చేతిలో 176 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఈ క్రమంలో 2-1 తేడాతో సిరీస్ కోల్పోయింది ఆస్ట్రేలియా.
కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో ఓటమి పాలైన ఆస్ట్రేలియాకు రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఇన్ని రోజులు అగ్ర స్థానంలో ఉన్న కంగారు జట్టు, రెండో స్థానానికి పడిపోయింది. దీంతో సఫారీ జట్టు అగ్రస్థానానికి చేరుకుంది. అటు ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ర్యాంకింగ్స్ లోనూ అగ్రస్థానం నుంచి పడిపోయి, మూడో స్థానానికి దిగజారింది. దీంతో న్యూజిలాండ్, సఫారీలు తొలి రెండు స్థానాలను దక్కించుకున్నాయి.